27, నవంబర్ 2013, బుధవారం

ఊర్కోండ (Urkonda)

 ఊర్కోండ గ్రామము
గ్రామముఊర్కోండ 
మండలముమిడ్జిల్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2416 (2001)
2814 (2011)
పర్యాటక ప్రాంతాలుఅభయాంజనేయస్వామి ఆలయం
ఊర్కోండ మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామ సమీపంలో గుట్టలపై అభయాంజనేయస్వామి అలయం ఉంది. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2814. జడ్చర్ల నుంచి కల్వకుర్తి వెళ్ళు రహదారి గ్రామం మీదుగా వెళ్ళుచున్నది.

జనాభా:
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2416. ఇందులో పురుషులు 1236, మహిళలు 1180. గృహాలసంఖ్య 584.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2814. ఇందులో పురుషులు 1391, మహిళలు 1423. గృహాలసంఖ్య 635. అక్షరాస్యత శాతం 52.27%. జనాభాలో ఇది మండలంలో 5వ స్థానంలో ఉంది.

రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా శ్రీనివాసులు ఎన్నికయ్యారు.

వ్యవసాయం:
గ్రామంలో పండే ముఖ్య పంటలు వరి, జొన్న, వేరుశనగ.

అభయాంజనేయ స్వామి దేవాలయం
ఊర్కొండ బస్సుస్టాప్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో అభయాంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ ప్రతియేటా ఘనంగా జాతర జరుగుతుంది. ఊర్కొండపేట సమీపంలో రెండు కొండల మధ్య ఆంజనేయస్వామి ఆలయం ఉంది.
ఆలయ చరిత్ర : భోజరాయపల్లి కి అతి సమీపంలో ఆనాడు అమ్మపల్లి అనే గ్రామము ఉండెడిది. ఆ రెండు గ్రామాల ప్రజలు ఏదో విషయమై తగాదా పడి వారి గ్రామమును వీరు, వీరీ గ్రామమును వారు తగులపెట్టుకొనడం తో భోజ రాయలు గ్రామము ఖాళీ చేయించి గట్ల నడుమ ఇప్పచెట్ల లో నూతన గ్రామము నిర్మింపచేసాడు. అదే నేటి గట్టు ఇప్పలపల్లి. భోజరాయలు శివోపాసకులు అయినందున గట్టు ఇప్పల పల్లి లో కాళికాదేవి తో పాటు పంచలింగాలను ప్రతిష్టించారు. గ్రామము నందు ఆంజనేయస్వామి విగ్రహము ప్రతిష్టించతలచి తగిన శిలకై వెదుకుతూ వచ్చి ఇక్కడ ఊరుకొండపేట పై శిలను కనుగొన్నారు. ఆంజనేయ స్వామి విగ్రహమును మలచి తరలించుచుండగా స్వామి వారు భోజరాయలుకు కలలో కనిపించి నన్ను ఇక్కడే ప్రతిష్టించమని ఆదేశించగా అతడు ఆ విగ్రహాన్ని అక్కడే నిలిపాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు స్వామివారికి ఆలయం కట్టించారని ఇతిహాసము.
కొండపై కోనేరు: అభయాంజనేయ స్వామి ఆలయానికి తూర్పు దిశలో కొండపై కోనేరు ఉంది. ఆ కోనేటిలో స్నానం చేసి స్వామి చుట్టూ 21 రోజుల ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఆపదలో ఉన్నవారికైనా క్షేమం కలుగుతుందని భక్తుల నమ్మకం.
శివుని విగ్రహం: కొండల మధ్య 24 అడుగుల ఎత్తు కల శివుని విగ్రహం ఉంది. అభయాంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తులు శివుని విగ్రహాన్ని కూడా దర్శిస్తారు.


విభాగాలు: మిడ్జిల్ మండలంలోని గ్రామాలు, 


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక