31, డిసెంబర్ 2013, మంగళవారం

చిలుకూరి వామన్‌రెడ్డి (Chilkuri Vaman Reddy)

 చిలుకూరి వామన్‌రెడ్డి
(1941-2013)
జననంసెప్టెంబరు 5, 1941
స్వగ్రామంవాఘాపూర్(ఆదిలాబాదు జిల్లా)
పదవులు2 సార్లు ఎమ్మెల్యే
నియోజకవర్గంఆదిలాబాదు అ/ని,
చిలుకూరి వామన్‌రెడ్డి ఆదిలాబాదు జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు. ఈయన సెప్టెంబరు 5, 1941న జన్మించారు. ఆదిలాబాదు మండలం వాఘాపూర్ గ్రామానికి చెందిన వామన్‌రెడ్డి విద్యాభ్యాసం మొత్తం ఆదిలాబాదులో జరిగింది. ఇంటర్ వరకు చదివి తండ్రి స్పూర్తితో రాజకీయాలలో ప్రవేశించారు. ఆదిలాబాదు నియోజకవర్గం నుంచి రెండుసార్లు విజయం సాధించారు. 2013, డిసెంబరు 30న చిలకూరి వామన్‌రెడ్డి మరణించారు.

రాజకియ ప్రస్థానం:
వామన్‌రెడ్డి తండ్రి భోజారెడ్డి 1957లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి 350 ఓట్ల స్వల్పతేడాతో ఓడిపోయారు. తండ్రిస్పూర్తితో రాజకీయాలలో వచ్చిన వామన్‌రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించారు. తొలిసారిగా 1978లో ఇందిరాకాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి పరాజయం పొందారు. ఆ తర్వాత 1980 వరకు ఆదిలాబాదు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మెన్‌గా పనిచేశారు. 1981లో ఆదిలాబాదు పంచాయతి సమితి అధ్యక్షులుగా ఇండిపెండెంటుగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. 1983లో కాంగ్రెస్ పార్టీ టికెట్టు లభించకపోవడంతో ఇండిపెండెంటుగా ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985లో తెలుగుదేశం ఫార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 1994లో తెలుగుదేశం పార్టీ తరఫున రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. తెరాస రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. .

విభాగాలు: ఆదిలాబాదు జిల్లా రాజకీయ నాయకులు, ఆదిలాబాదు మండలము, ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, 7వ శాసనసభ సభ్యులు, 10వ శాసనసభ సభ్యులు, 1941లో జన్మించినవారు, 2013లో మరణించినవారు,


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక