19, డిసెంబర్ 2013, గురువారం

గిద్దలూరు (Giddaluru)

 గిద్దలూరు 
పట్టణంగిద్దలూరు
జిల్లాప్రకాశం
జనాభా26977 (2001)


గిద్దలూరు ప్రకాశం జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. సగిలేరు నది తీరాన ఉన్న గిద్దలూరు పట్టణం  గుంటూరు - ద్రోణాచలము రైల్వేమార్గంలో ఉంది. పట్టణంలో పురాతన పాతాలనాగేశ్వరస్వామి ఆలయం ఉన్నది. ఇది 15.35 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 78.91 డిగ్రీల తూర్పు రేఖాంశంపై ఉన్నది. సముద్ర మట్టం నుంచి 253 మీటర్ల ఎత్తులో ఉంది. పట్టణం పరిసరాలలో పలు చారిత్రక ప్రాంతాలున్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గిద్దలూరు పట్టణ జనాభా 26977. ఇందులో పురుషులు 13662, మహిళలు 13315. గృహాల సంఖ్య 5979.

రవాణా సౌకర్యాలు:
గిద్దలూరుకు రోడ్డు సదుపాయమే కాకుండా రైలు సౌకర్యం కూడాఉంది. ద్రోణాచలం-గుంటూరు రైల్వేమార్గంపై ఈ పట్టణం ఉన్నది. 

చరిత్ర:
గిద్దలూరు యొక్క పూర్వ నామము సిద్ధలూరు. పూర్వం ఈ ప్రాంతంలో సిద్ధులు తపస్సు ఆచరించిన ప్రదేశం కాబట్టి సిద్ధలూరు పేరు వచ్చినట్లుకథనం. కుంచాల రామచంద్రుడు ఈ గ్రామాన్ని అగ్రహారంగా పొందాడు. సిద్ధలూరి ప్రాభవము పెరిగి గ్రిద్ధలూరని కొత్త పేరు సంతరించుకొన్నది. కుంచాల రామచంద్రుని వంశజుడు అయిన కుంచెల వెంకటాద్రయ్య గిద్దలూరిని మెరుగు పర్చాడు. హరిహర దేవరాయల కాలములో రామచంద్రరాజు ఈ ప్రాంతములను జాగీర్దారుగా పరిపాలించుటకు వచ్చి ఈ గ్రామములను వెంకటాద్రి నుండి వశము చేసుకొన్నాడు. కానీ ఆ తర్వాత కాలములో వెంకటాద్రి నుండి ఆ వంశములో మూడవ తరానికి చెందిన రామచంద్ర, హరిహర రాయలచే పునస్థాపించబడి తన గ్రామాలను తిరిగి పొందెను. ఆయన కరణముగా కూడా నియమించబడెను. ఈ విధముగా ముస్లింలు రాక వరకు రామచంద్రరాజు వంశజులు గిద్దలూరును పరిపాలించారు. రాయల పాలన ముగింపుతో గిద్దలూరు ముస్లింల ఆక్రమణకు గురై, ఆ తరువాత కాలములో దత్తమండలాలను నిజాము బ్రిటీషువారికి దత్తము చేసినప్పుడు కడప జిల్లాలో భాగముగా ఉన్న గిద్దలూరు బ్రిటిషు పాలనలోకి వచ్చింది. కర్నూలు జిల్లా ఏర్పడిన తర్వాత కర్నూలు జిల్లాలోను భాగమై, 1971లో ఒంగోలు జిల్లా ఏర్పాటు చేసినప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాలో కలపబడినది.

1930వ దశకములో పురావస్తు శాస్త్రజ్ఞులు గిద్దలూరు పరిసరాల్లో పాత రాతియుగము నాటి ఆధారాలు కనుగొన్నారు. ఇక్కడ మధ్య రాతియుగము నాటి చిన్న రాతి పనిముట్లు కూడా బయల్పడ్డాయి.

రాజకీయాలు:
ఈ పట్టణం గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం, ఒంగోలు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.



విభాగాలు: ప్రకాశం జిల్లా పట్టణాలు, గిద్దలూరు మండలము, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక