19, డిసెంబర్ 2013, గురువారం

మధిర అసెంబ్లీ నియోజకవర్గం (Madhira Assembly Constituency)

మధిర అసెంబ్లీ నియోజకవర్గం ఖమ్మం జిల్లాకు చెందిన 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గంలో 5 మండలాలున్నాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 5 మండలాలు కలవు.
 • ముదిగొండ,
 • చింతకాని,
 • బోనకల్,
 • మధిర,
 • ఎర్రుపాలెం
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1983 శీలం సిద్ధారెడ్డి కాంగ్రెస్ పార్టీ బోడేపూడి వెంకటేశ్వరరావు సి.పి.ఎం
1985 బోడేపూడి వెంకటేశ్వరరావు సి.పి.ఎం శీలం సిద్ధారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1989 బోడేపూడి వెంకటేశ్వరరావు సి.పి.ఎం శీలం సిద్ధారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1994 బోడేపూడి వెంకటేశ్వరరావు సి.పి.ఎం శీలం సిద్ధారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1997 కట్టా వెంకట నరసయ్య సి.పి.ఎం

1999 కొండబాల కోటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కట్టా వెంకట నరసయ్య సి.పి.ఎం
2004 కట్టా వెంకట నరసయ్య సి.పి.ఎం కొండబాల కోటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ
2009 మల్లు భట్టివిక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎల్.కమల్‌రాజ్ సి.పి.ఎం.
2014 మల్లు భట్టివిక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎల్.కమల్‌రాజ్ సి.పి.ఎం.

2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సి.పి.ఎం పార్టీ అభ్యర్థి కట్టా వెంకట నరసయ్య తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండబాల కోటేశ్వరరావుపై 21433 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వెంకట నరసయ్యకు 71405 ఓట్లు రాగా, కోటేశ్వరరావుకు 49972 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు భట్టివిక్రమార్క తన సమీప ప్రత్యర్థి, సిపిఎం పార్టీ అభ్యర్థి అయిన ఎల్.కమల్‌రాజ్ పై 1417 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నియోజకవర్గంలో మొత్తం 183475 ఓట్లు ఉండగా 159511 ఓట్లు పోలయ్యాయి. భట్టి విక్రమార్కకు 59112ఓట్లు రాగా, కమల్‌రాజ్ కు 57786 ఓట్లు లభించాయి. ఎమ్మార్పీఎస్ అభ్యర్థి మందకృష్ణ మాదిగ 21712 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి సగ్గుర్తి విజయవాణికి 14512 ఓట్లు వచ్చాయి. 13వ శాసనసభలో మల్లు భట్టివిక్రమార్క ప్రభుత్వ ఛీప్ విప్‌గా నియమియులైనారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన సిటింగ్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క తన సమీప ప్రత్యర్థి, సీపీఎం పార్టీ అభ్యర్థి అయిన కమల్ రాజ్‌పై 11655 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.


విభాగాలు: ఖమ్మం జిల్లా నియోజకవర్గాలు, ఖమ్మం లోకసభ నియోజకవర్గం, మధిర అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక