11, డిసెంబర్ 2013, బుధవారం

ఇన్ముల్‌నర్వ (Inmulnarwa)

 ఇన్ముల్‌నర్వ గ్రామము
గ్రామముఇన్ముల్‌నర్వ 
మండలముకొత్తూరు 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా4259 (2001)
ఇన్ముల్‌నర్వ మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4259. ఇందులో పురుషులు 2195, మహిళలు 2064. గృహాల సంఖ్య 803.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5151. ఇందులో పురుషులు 2649, మహిళలు 2502. గృహాల సంఖ్య 1144. అక్షరాస్యత శాతం 48.86%. గ్రామ కోడ్ సంఖ్య 575222.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా పి.కమలమ్మ ఎన్నికయ్యారు.

జహంగీర్ పీర్ దర్గా:
రాష్ట్ర రాజదానికి 36 కి.మీ. దూరంలో కల కొత్తూరు మండలంలోని ఇన్ముల్‌నర్వ గ్రామ సమీపంలో జహంగీర్ పీర్ దర్గా కలదు. ప్రతి సంవత్సరము సంక్రాంతి పర్వదినాలలో 3 రోజుల పాటు దర్గాలో ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. సుమారు 700 సం.ల క్రితం బాగ్దాద్ నుండి గౌస్ మొహినొద్దీన్, బురానొద్దిన్ అనే ఇరువురు మత గురువులు దేశ సంచారము చేస్తూ ఇక్కడికి వచ్చి కొంత కాలం తరువాత మరణించినారని చెబుతారు. వారి ఇద్దరి సమాధులే జహంగీర్ పీర్ దర్గాగా వాడుకలో కొచ్చిందని నమ్ముతారు. 400 సం.ల క్రితం గోలుకొండ కోటపై విజయం సాధించిన రాజులు తరువాత ఈ దర్గాకు వచ్చి పూజలు చేసారని ప్రతీతి. దర్గాకు నిర్వాహకులు లేనందున తమ సిపాయిలలో ఒకరైన సయ్యద్ ఇబ్రాహిం అలీని దర్గా సంరక్షకుడుగా నియమించి, 4 పరగణాలకు ఖాజీగా కూడా నియుక్తులను చేసారు. 1948 సం. వరకు ఇబ్రాహిం అలీ వారసులు సంరక్షించే వారు. ఆ తరువాత రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఆదీనంలోకి ఈ దర్గా వచ్చింది. మరొక వర్గం అభిప్రాయం ప్రకారం దర్గా స్థానంలో పూర్వ కాలంలో నరసింహ స్వామి దేవాలయం ఉండేదని అందుకే విశ్వాసంతో హిందువులు కూడా అధిక సంఖ్యలో ఈ దర్గాకు వస్తారని ఇక్కడి వారి నమ్మకం. ఇక్కడికి వెళ్ళడానికి హైద్రాబాద్ నుండి ప్రతి ఆదివారము మరియు గురువారము రోజున ప్రత్యేక బస్సులు నడుస్తుంటాయి. ఆటో, జీపులు కూడా నడుస్తుంటాయి.


విభాగాలు: కొత్తూరు మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగు వికీపీడియా,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక