కల్వకుర్తి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన ఎడ్మ కిష్టారెడ్డి స్వస్థలం. ఈ పట్టణం పరిసరాలలో అనేక చారిత్రక ప్రాంతాలున్నాయి. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న ఈ పట్టణం 2012లో పురపాలక సంఘంగా మారింది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 25146. ఇందులో పురుషులు 13126, మహిళలు 12020. గృహాల సంఖ్య 4672. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 28060. ఇందులో పురుషులు 14313, మహిళలు 13747. గృహాల సంఖ్య 6102. అక్షరాస్యత శాతం 66.97%. గ్రామ కోడ్ సంఖ్య 575593. చరిత్ర: కల్వకుర్తి పట్టణం తొలుత కవులకుర్తి, కలువలకుర్తిగా పిలవబడి కాలక్రమంలో కల్వకుర్తిగా మారినట్లు తెలుస్తుంది. సాహితీవేత్తలకు నిలయమైన కల్వకుర్తిలో చారిత్రక కట్టడాలు, ప్రాచీన దేవాలయాలు, జైన, బౌద్ద యుగాలకు చెందిన శిలామండపాలు కనిపిస్తాయి. ప్రముఖ కవి, చిత్రభారతం రచయిత చరికొండ ధర్మన్న కల్వకుర్తి ప్రాంతానికి చెందినవాడు. కార్వంగ కాకతీయుల రాజుల రాజధానిగా ఉన్నట్లుగా శిలాశాసనాలు, శిథిల కట్టడాల వల్ల తెలుస్తుంది. బొబ్బిలి యుద్ధంలో శౌర్య పరక్రమాలతో పేరొందిన పాపరాయుడు తాండ్ర గ్రామానికి చెందిన వాడేనని చార్రిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ప్రసిద్ధివాగ్గేయ కారుడు, హన్మత్‌దాస్ జన్మస్థలం వేపూర్ గ్రామం. మార్చాల గ్రామానికి చెందిన సోదరుడు రంగాచార్యులు, రామాచార్యులు గొప్ప చిత్ర కారులుగా పేరుపొందారు. ఇర్విన్ గ్రామంలో కాకతి రుద్రమదేవి వేయించిన శాసనాలు లభించాయి. నిరంకుశ నిజాం పాలన వ్యతిరేక పోరాటంలో కల్వకుర్తిలో లింగారెడ్డి నాయకత్వంలో తదితరులు నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. రవాణా సౌకర్యాలు: ఈ పట్టణం ప్రధాన రోడ్డు కూడలి. హైదరాబాదు-శ్రీశైలం ప్రధాన రహదారి మరియు మహబూబ్‌నగర్-నల్గొండ రహదారి పట్టణం గుండే వెళ్ళుచున్నవి. ఇక్కడి నుంచి పలు ప్రధాన పట్టణాలకు రవాణా సౌకర్యాలున్నాయి.
= = = = =
|
23, డిసెంబర్ 2013, సోమవారం
కల్వకుర్తి (Kalwakurty)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి