8, డిసెంబర్ 2013, ఆదివారం

కాపు రాజయ్య (Kapu Rajaiah)

 కాపు రాజయ్య
(1925-2012)
జననం7 ఏప్రిల్, 1925
స్వస్థలంసిద్ధిపేట (మెదక్ జిల్లా)
రంగంచిత్రకారుడు
మరణం20 ఆగష్టు, 2012
చిత్రకారుడిగా ప్రసిద్ధి చెందిన కాపు రాజయ్య 7 ఏప్రిల్, 1925న మెదక్ జిల్లా సిద్ధిపేటలో జన్మించారు. హైదరాబాదులోని ప్రభుత్వ కళాశాల నుండి చిత్రకళలో డిప్లోమా పొందారు.ఈయన చిత్రపటాలు ప్రపంచం లోని పలు ప్రదేశాలలో ప్రదర్శింపబడినవి. ఈయన 1963 లో లలితకళా సమితిని స్థాపించారు. 20 ఆగష్టు, 2012న మరణించారు.

చిత్రకళ:
చిత్రకళలో జాతీయ స్థాయిలో పేరుపొందిన రాజయ్య చిత్రాలు చెకోస్లోవికియా, హంగేరి, రుమేనియా, బల్గేరియా దేశాల్లో ప్రదర్శనలు పెట్టారు. జెఎన్‌టియు ఆయనను గౌరవ డాక్టరేట్ ద్వారా గౌరవించింది. నిరుపేద కుటుంబంలో పుట్టి కళారంగంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. చిన్న వయస్సులోనే తండ్రి మరణించడంతో ఆయన తీవ్రమైన ఇబ్బందుల పాలయ్యారు. రాజయ్యకు 50 దాకా అవార్డులు వచ్చాయి. రాష్ట్రప్రభుత్వం ఆయనను 1966లో రజత పత్రంతో సత్కరించింది. 1969లో తామ్ర పత్రంతో సత్కరించింది. 1975లో ఆయనకు చిత్ర కళాప్రపూర్ణ సత్కారం లభించింది. వడ్డెర మహిళ, ఎల్లమ్మ జోగి, గోపికా కృష్ణ, పంటపొలాలు, వసంతకేళి, కోలాటం వంటి ఎన్నో అద్భుతమైన కళాఖండాలకు ఆయన ప్రాణం పోశారు.

అవార్డులు
 • చిత్రకళా ప్రపూర్ణ (1975)
 • సీనియర్ ఫెలోషిప్ (1988 లో భారతదేశ ప్రభుత్వంచే),
 • లలిత కళా అకాడమి అవార్డు,
 • కళాప్రవీణ (1993లో జే ఎన్ టీ యూ వారిచే),
 • కళారత్న (1993లో మదనపల్లికి చెందిన భరతముని ఆర్ట్స్ అకాడమీచే),
 • కళావిభూషణ (AIFACS చే),విభాగాలు: మెదక్ జిల్లా ప్రముఖులు, సిద్ధిపేట మండలము, తెలుగు చిత్రకారులు, 1925లో జన్మించినవారు, 2012లో మరణించినవారు, 


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక