8, డిసెంబర్ 2013, ఆదివారం

బాపు (Bapu)

బాపు
(సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ)
జననండిసెంబరు 15, 1933
స్వస్థలంనర్సాపురం (ప గో జిల్లా)
రంగంచిత్రకళ, సినిమా దర్శకుడు,
అవార్డులుపద్మశ్రీ, రాజ్యలక్ష్మి పురస్కారం
మరణంఆగస్టు 31, 2014
బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. బాపు డిసెంబరు 15, 1933న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించారు. 1955లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి లాయర్ పట్టా పుచ్చుకున్నారు. అదే సంవత్సరం ఆంధ్ర పత్రిక దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు. చిత్రకళలోనే కాకుండా సినిమా దర్శకుడిగానూ రాణించారు. ఆగస్టు 31, 2014న బాపు చెన్నైలో మరణించారు.

చిత్రకళ:
1945 నుండి బాపు చిత్రాలనూ, వ్యంగ్యచిత్రాలనూ, పుస్తకాల ముఖచిత్రాలనూ, పత్రికల ముఖచిత్రాలనూ, కథలకు బొమ్మలనూ, విషయానుగుణ చిత్రాలనూ పుంఖాను పుంఖాలుగా సృష్టిస్తున్నారు. కొత్త రచయితలూ, ప్రసిద్ధ రచయితలూ, పురాణాలూ, జీవితమూ, సంస్కృతీ, రాజకీయాలూ, భక్తీ, సినిమాలూ - అన్ని రంగాలలో ఆయన గీతలు వాసికెక్కాయి. బాపు రాత కూడా అంతే. ఇంతవరకూ తెలుగునాట ఎవరి చేతి వ్రాతకూ ఆ ప్రాముఖ్యత అందలేదు. తెలుగులో బాపు అక్షరమాల (ఫాంట్) ఎన్నో డి.టి.పి సంస్థలూ, ప్రచురణా సంస్థలూ వాడుతుంటాయి. ముళ్ళపూడీ వెంకట రమణ రచించిన బుడుగు పుస్తకానికి బాపు బొమ్మలు గీశారు. సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల పుస్తకానికి 101 బొమ్మలు వేశారు.

సినిమా దర్శకుడిగా:
1967లో సాక్షి (సినిమా) చిత్రదర్శకునిగా సినిమారంగంలో అడుగుపెట్టిన బాపు మొదటి చిత్రంతోనే ప్రసంసలు అందుకొన్నారు. ఆయన మొత్తం 41 చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాపు తను తీయబోయే చలన చిత్రపు సన్నివేశాలను సచిత్రంగా ( స్టోరీబోర్డు ) తయారు చేసుకుని తెరమీదకి ఎక్కిస్తారు. ముళ్ళపూడి వెంకట రమణతో కలిసి పలు సినిమాలాకు కథలు వ్రాశారు.

పురస్కారాలు:
  • బాపు దర్శకత్వం వహించిన ముత్యాల ముగ్గు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు లభించింది.
  • 1983లో తమిళనాడుకు చెందిన రాజ్యలక్ష్మి పురస్కారం లభించింది.
  • 1991 వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ బహూకరణ.
  • 1992 వ సంవత్సరంలో అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) వారిచే శిరోమణి పురస్కారం అమెరికాలో స్వీకరణ.
  • 2013లో బాపు భారత ప్రభుత్వంచే పద్మశ్రీ బిరుదాన్ని పొందారు.
ఇవి కూడా చూడండి:


విభాగాలు: పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు, నర్సాపురం మండలం, 1933లో జన్మించినవారు, తెలుగు చిత్రకారులు, తెలుగు సినిమా దర్శకులు, 2014లో మరణించినవారు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక