3, డిసెంబర్ 2013, మంగళవారం

కోడంగల్ (Kodangal)

 కోడంగల్  గ్రామము
గ్రామముకోడంగల్ 
మండలముకోడంగల్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా13434 (2001)
14294 (2011)
కోడంగల్ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది మేజర్ గ్రామపంచాయతి. హైదరాబాదు నుంచి బీజాపూర్ వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి కోడంగల్ నుంచి వెళ్తుంది. ఈ గ్రామం హైదరాబాదు నుంచి 100 కిమీ, మహబూబ్ నగర్ నుంచి 60 కిమీ దూరంలో, తాండూరు నుంచి 18 కిమీ దూరంలో ఉంది. సినీనటుడు ఖలీల్ ఈ గ్రామానికి చెందినవారు. ప్రసిద్ధి చెందిన శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ఈ గ్రామంలో ఉంది.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామం భౌగోళికంగా మండలంలో తూర్పువైపున ఉన్నది. ఈ గ్రామానికి దక్షిణాన పర్సాపూర్, నైరుతిన ప్యాలమద్ది, పశ్చిమాన చిట్లపల్లి, వాయువ్యాన అప్పాయిపల్లి, ఉతరాన ఉడిమెశ్వరం గ్రామాలు, తూర్పున బొంరాస్‌పేట్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 13434. ఇందులో పురుషులు 6919, మహిళలు 6515. గృహాల సంఖ్య 2341.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 14294. ఇందులో పురుషులు 7051, మహిళలు 7243. గృహాల సంఖ్య 3052. అక్షరాస్యత శాతం 58.67%. గ్రామ కోడ్ సంఖ్య 574905.

కోడంగల్ బస్సుస్టేషన్
రవాణా సౌకర్యాలు:
హైదరాబాదు నుంచి యాద్గీర్ వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి మరియు మహబూబ్‌నగర్ నుంచి తాండూరు వెళ్ళు ప్రధానరహదారి గ్రామం గుండా వెళ్ళుచున్నాయి. కాబట్టి రాష్ట్ర రాజధాని, జిల్లా రాజధాని మరియు తాండూరు, కర్ణాటకల నుంచిమంచి రవాణా సౌకర్యాలున్నాయి. గ్రామానికి రైలు సదుపాయం లేకున్ననూ 18 కిమీ దూరంలో ఉన్న తాండూరు రైల్వేస్టేషన్ గ్రామస్థులకు అందుబాటులో ఉంది.

గ్రామపాలన:
కోడంగల్ గ్రామపాలన మేజర్ గ్రామపంచాయతిచే కొనసాగుతోంది. ఒకప్పుడు ఇది పురపాలక సంఘం. 1964లో మేజర్ గ్రామపంచాయతిగా మార్చబడింది. ఎందరో ప్రముఖులు ఈ పంచాయతి సర్పంచులుగా పనిచేసి రాజకీయంగా పైకి వచ్చారు.

రాజకీయాలు:
జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా వెంకటరెడ్డి ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:

లాహోటి డిగ్రీ కళాశాల, నవోదయ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల.


విభాగాలు: కోడంగల్ మండలంలోని గ్రామాలు


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక