19, డిసెంబర్ 2013, గురువారం

పడాల రామారెడ్డి (Padala Ramareddy)

 పడాల రామారెడ్డి
జననంమార్చి 25, 1929
స్వస్థలం పిట్టల వేమవరం
జిల్లాపశ్చిమ గోదావరి
రంగంన్యాయవాది, రచయిత
ప్రముఖ న్యాయవాది, న్యాయశాస్త్రపు గ్రంథాల రచయిత అయిన పడాల రామారెడ్డి మార్చి 25, 1929న జన్మించారు. రామారెడ్డి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరున్న పిట్టల వేమవరం గ్రామం. చెన్నపట్నం లా కాలేజీలో న్యాయశాస్త్ర పట్టా పొందారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక గుంటూరు హైకోర్టులో ఎల్‌.డి.సి. ఉద్యోగం దొరికింది. యుడిసిగా, ట్రాన్స్‌లేటర్‌గా పదోన్నతి లభించింది. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడి హైకోర్టు హైదరాబాదుకు తరలి వచ్చినప్పుడు లైబ్రేరియన్‌గా ప్రమోషన్ వచ్చింది.

న్యాయశాస్త్రానికి సంబంధించి ఆయన మొత్తం 150 గ్రంథాలను రచించారు. ఆయన రాసిన తెలుగు పుస్తకాల్లో మండల జిల్లా ప్రజాపరిషత్ కోడ్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ లా మాన్యువల్, గ్రామ పంచాయితీలా మాన్యువల్, క్రిమినల్ లా మాన్యువల్, భారత రాజ్యాంగానికి వ్యాఖ్యానం వగైరాలున్నాయి. డ్రాఫ్టింగ్ ఆఫ్ డీడ్స్ అండ్ డాక్యుమెంట్స్, అడ్వకేట్స్ ప్రాక్టీస్, సివిల్ సర్వీస్ కోడ్, పెన్షన్ కోడ్ వంటివి ఇంగ్లీషులోనూ రాశారు. 1988లో 'పడాల రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ' స్థాపించి, ఈ సంస్థకు అనుబంధంగా ఎల్లారెడ్డిగూడా అమీర్‌పేట్, హైదరాబాద్ లో 'పడాల రామారెడ్డి లా కాలేజీ'ని ప్రారంభించారు..


విభాగాలు: పశ్చిమగోదావరి జిల్లా ప్రముఖులు, 1929లో జన్మించినవారు,


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక