13, జనవరి 2014, సోమవారం

అంజలీ దేవి (Anjali Devi)

అంజలీ దేవి
జననంఆగష్టు 24, 1927
రంగంసినీనటి, నిర్మాత
అవార్డులురఘుపతి వెంకయ్య అవార్డు (2005),
మరణం13 జనవరి, 2014
తొలితరం సినిమా నటి అంజలీదేవి 1927 ఆగష్టు 24న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు. ఈమె అసలుపేరు అంజనీ కుమారి. నర్తకిగా నటనాజీవనం ప్రారంభించి, సినీనటిగా 500పైగా చిత్రాలలో నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా పలు చిత్రాలు నిర్మించింది. 2005లో రఘుపతి వెంకయ్య అవార్డు పొందినది. ఈమె భర్త పి.ఆదినారాయణరావు కూడా సినీరంగంలో దర్శకుడిగా పేరుగాంచారు. అంజలీ దేవి చెన్నైలో 13 జనవరి, 2014న 86 సంవత్సరాల వయస్సులో మరణించింది.

సినీప్రస్థానం:
అంజలీదేవి తొలిసారిగా లోహితాస్య పాత్రతో రాణించి, రాజాహరిశ్చంద్ర సినిమాలో తొలిసారిగా సినీరంగానికి పరిచయమై, లవకుశ సినిమాలో సీత పాత్రతో గుర్తింపు పొంది పలు హిట్ చిత్రాలలో తన నటనతో ప్రేక్షకుల మనసుదోచి 500కు పైగా సినిమాలలో నటించింది. సువర్ణసుందరి, లవకుశ, బాలనాగమ్మ, అనార్కలి, చెంచులక్ష్మి, భట్టివిక్రమార్క లాంటి ప్రజాదరణ పొందిన తెలుగు చిత్రాలలో నటించడమే కాకుండా పలు హిందీ సినిమాలలో కూడా నటించింది. అంజలీ పిక్చర్స్ సంస్థను స్థాపించి చండీప్రియ, భక్త తుకారాం, అనార్కలి లాంటి 27  సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. 1995లో రఘుపతి వెంకయ్య అవార్డు స్వీకరించింది.విభాగాలు: తెలుగు సినిమా నటులు, తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు, 1927లో జన్మించినవారు, 2014లో మరణించినవారు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
 • తెలుగు వికీపీడియా,
 • వెంకయ్య అవార్డు వెలుగులు (రచన: హెచ్.రమేష్ బాబు),

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక