2, జనవరి 2014, గురువారం

బుచ్చిబాబు (Buchibabu)

 బుచ్చిబాబు 
జననంజూన్ 14, 1916
స్వస్థలంఏలూరు
రంగంనవలాకారుడు, నాటకకర్త,
మరణం1967
ప్రముఖ నవలాకారుడు, నాటకకర్త మరియు కథకుడుగా పేరుగాంచిన బుచ్చిబాబు 1916 జూన్ 14న ఏలూరులో జన్మించారు. ఇతని అసలుపేరు శివరాజు వేంకట సుబ్బారావు. తెలుగులో బుచ్చిబాబు పేరుతో, ఆంగ్లంలో సంతోష్ కుమార్ పేరుతో రచనలు చేశారు. బుచ్చిబాబు రచించిన "చివరకు మిగిలేది" నవల ప్రఖ్యాతి చెందింది. ఈయన 1967లో మరణించారు.

బుచ్చిబాబు ప్రాథమిక విద్య కంకిపాడులో జరిగింది. పాలకొల్లులో ఎస్.ఎస్.ఎల్.సి.లో ఉత్తీర్ణులై, ఇంటర్మీడియట్ మరియు బి.ఏ. పట్టాలు గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చదివారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ. ఆనర్సులో ఉత్తీర్ణులై, నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి 1941లో ఎం.ఏ. (ఇంగ్లీష్ లిటరేచర్) పట్టా పొందారు. డిగ్రీ అభ్యసన సమయంలోనే రచనలు ప్రారంభించారు. ఈయన కొన్నాళ్ళు అనంతపురం మరియు విశాఖపట్నంలలో ఆంగ్ల ఉపన్యాసకుడిగా పనిచేశారు. 1945 నుండి 1967లో మరణించేవరకు ఆలిండియా రేడియోలో పనిచేశాడు. బుచ్చిబాబు మొత్తం 82 కథలు, ఒక వచనకావ్యం, 40 వ్యాసాలు, నాటకాలు రచించారు. బుచ్చిబాబు రచించిన "రాయల కరుణ కృత్యము" నాటిక "మల్లీశ్వరీ సినిమాకు ఆధారమైంది. బుచ్చిబాబు రచించిన ప్రముఖ నవల "చివరకు మిగిలేది"పై అనేకమంద్ పరిశోధనలు చేశారు.

గుర్తింపులు:
బుచ్చిబాబు రచించిన "షేక్స్‌పియర్ సాహిత్య విమర్శ" కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.


విభాగాలు: తెలుగు రచయితలు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు, 1916లో జన్మించినవారు, 1967లో మరణించినవారు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక