2, జనవరి 2014, గురువారం

కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం (Korutla Assembly Conctituency)

కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఈ నియోజవర్గంలో 4 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ నిజామాబాదు  లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఇది కొత్తగా ఏర్పడింది.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 4 మండలాలు కలవు.
  • ఇబ్రహీంపట్నం,
  • మల్లాపూర్,
  • కోరుట్ల,
  • మెట్‌పల్లి,

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 కె.విద్యాసాగర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి రత్నాకర్ రావు కాంగ్రెస్ పార్టీ
2010* కె.విద్యాసాగర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి రత్నాకర్ రావు కాంగ్రెస్ పార్టీ
2014 కె.విద్యాసాగర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి నర్సింగరావు ఇండిపెండెంట్
2018 కె.విద్యాసాగర్ రావు తెరాస నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కె.విద్యాసాగర్ రావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, దేవాదాయశాఖ మంత్రి అయిన రత్నాకర్ రావుపై 15545 ఓట్ల తేడాతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. మొత్తం 191832 ఓట్లలో 125459 ఓట్లు పోల్ కాగా విద్యాసాగర్ రావుకు 41816 ఓట్లు, జువ్వాడి రత్నాకర్ రావుకు 26316 ఓట్లు లభించాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో విద్యాసాగర్ రావు రాజీనామా చేయగా ఫిబ్రవరి 15, 2010న స్పీకర్ ఆమోదించారు.

2010 ఉప ఎన్నికలు:
ప్రత్యేక తెలంగాణ నేపథ్యంలో విద్యాసాగర్ రావు రాజీనామా చేయగా జరిగిన ఉప ఎన్నికలలో కె.విద్యాసాగర్ రావు మళ్ళీ తెరాస తరఫున పోటీచేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున జువ్వాడి రత్నాకర్ రావు పోటీచేశారు. ఈ ఎన్నికలలో విద్యాసాగర్ రావు జువ్వాడిపై 55వేలకు పైగా ఓట్లతో గెలుపొందినారు. విద్యాసాగర్ రావుకు 80495 ఓట్లు, జువ్వాడికి 23970 ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శికారి విశ్వనాథంకు 3800 ఓట్లతో నాలుగోస్థానం పొంది డిపాజిట్ కోల్పోయారు. ఇండిపెండెంట్ అభ్యర్థి పార్వతి రాజలింగం 4874 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఈ ఎన్నికలలో భాజపా తెరాసకు మద్దతు ప్రకటించింది. మొత్తం 67 అభ్యర్థులు పోటీచేశారు. మొత్తం ఓటర్లు 193935లో 127364 ఓట్లు పోల్ అయ్యాయి.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన కె.విస్యాసాగర్ రావు తన సమీప ప్రత్యర్థి, ఇండిపెండెంటుగా పోటీచేసిన నర్సింగరావుపై 20585 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, భాజపా తరఫున జంగిలి వెంకట్, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన జువ్వాడి నర్సింగరావు పోటీచేశారు. తెరాసకు చెందిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన జువ్వాడి నరసింగరావు పై 31220 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.



విభాగాలు: కరీంనగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, నిజామాబాదు లోకసభ నియోజకవర్గం, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక