కాకినాడ తూర్పు గోదావరి జిల్లా యొక్క పరిపాలన కేంద్రము. ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరప్రాంతములోముఖ్యమైన రేవు పట్టణం. ప్రణాళికా బద్ధంగా ఉన్న కారణంగా కో-కెనడా గానూ పిలుస్తూ ఉంటారు. ఇది రెండో మద్రాసుగా, ఎరువుల నగరంగానూ పిలువబడును. ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం రసాయనాలు పెట్రోరసాయనాల పెట్టుబడి ప్రాంతం పరిధి కాకినాడని ఆనుకొనే మొదలవుతుంది. 2011 లెక్కల ప్రకారం 3,12,936 పట్టణ జనాభాతో ఇది రాష్ట్రంలో 9వ పెద్ద నగరంగా ఉంది. బకింగ్‌హాం కాలువ నగరం గుండా వెళ్ళును.
నైసర్గిక స్వరూపము కాకినాడ 16.93° ఉత్తర అక్షాంశం, 82.22° తూర్పు రేఖాంశంపై ఉంది. భారతీయ ప్రామాణిక కాలమానానికి (Indian Standard Time) అధారభూతమైన 82.½° తూర్పు రేఖాంశం కాకినాడ సమీపం నుంచి వెళ్ళుచున్నది. చరిత్ర: కాకినాడ పేరు మొదట కాకి నందివాడ అని ఉండేదని, అది కాలక్రమముగా కాకినాడ గా నామాంతరం చెందిందని చెబుతారు. స్వాతంత్ర్యం రాక ముందు కొంతకాలం కాకినాడ పేరు కొకనాడగా చలామణి అయ్యింది. ఇక్కడకి మొదట డచ్ వారు వర్తకం చేసుకొనడానికి వచ్చి వారి స్థావరం ఏర్పరచుకొన్నారు. వారి తరువాత ఆంగ్లేయులు వారి స్థావరం ఏర్పాటు చేసుకొన్నారు. తరువాత కెనడియన్ బాప్తిస్టు క్రైస్తవ మిషనరీలు ఇక్కడకి వచ్చారు. వారు కాకినాడ నగరాన్ని చూసి ఇది అచ్చు వారి కెనడ నగరాన్ని తలపించడంతొ వారు ఈ నగరాన్ని కో-కెనడ అని పిలిచెవారు అది కాలక్రమంగా కాకినాడగా వాడుకలోకి వచ్చింది.
కాకినాడ మిగిలిన పట్టణాలతో సామర్లకోట -కాకినాడ లూప్-లైన్ ద్వారా కలుపబడి ఉన్నది. కాకినాడ స్టేషన్లలో రైళ్ళన్నీ కాకినాడ నుండే బయలుదేరుతాయి. కాకినాడ నగరంలో నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కాకినాడ పోర్ట్, కాకినాడ న్యూపోర్ట్, కాకినాడ టౌన్, సర్పవరం. ఇందులో కాకినాడ పోర్ట్ స్టేషన్ పూర్తిగా గూడ్స్ బళ్ళకు కేటాయించబడినది. కాకినాడ హైదరాబాదు నుంచి 564 కి మీ ల దూరంలో ఉన్నది. చెన్నై - కోల్కతా రైలు మార్గం లో సామర్లకోట దగ్గర బండి మారాలి. ఈ మార్గంలో వెళ్లే బళ్ళలో సుమారుగా అన్నీ సామర్లకోట వద్ద ఆగుతాయి. సామర్లకోట నుండి కాకినాడ ప్రధాన బస్టాండ్ కి ఆర్టీసి బస్సులు అన్ని వేళలా ఉంటాయి. దూరం 10 కి.మీ.జాతీయ రహదారి సంఖ్య 214 నగరం గుండా వెళ్తుంది. కాకినాడ కు 65 కి మీ దూరంలో రాజమండ్రి విమానాశ్రయం ఉంది. ఇది చెన్నై, హైదరాబాద్, విజయవాడ, బెంగుళూర్ లకు విమానయాన సేవలను కలిగి ఉంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, జెట్ ఎయిర్ వేస్ మరియు స్పైస్ జెట్ ఇక్కడ ఆపరేటింగ్ ఎయిర్ లైన్స్. ఇతర సమీప ప్రధాన విమానాశ్రయం కాకినాడ నుండి 145 కి మీ దూరంలో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది రాష్ట్రములోని ప్రధానమైన ఓడరేవులలో ఒకటి.
రాష్ట్రంలోని ప్రధాన రేవుపట్టణాలలో ఇది ఒకటి. నగరంలో 2 ఎరువుల కర్మాగారాలున్నాయి. నాగార్జున ఎరువుల కర్మాగారం కోస్తా ప్రాంతంలోనే యూరియా తయారీ కర్మాగారాలలో పెద్దది. మరొకటి గోదావరి ఎరువుల కర్మాగారం. కొబ్బరి ఎగుమతికి కూడా ఈ నగరం ప్రఖ్యాతి చెందింది. మురుగుప్ప గ్రూపునకు చెందిన చక్కెర కర్మాగారాలు కూడా నగరంలో ఉన్నాయి. ఓ.ఎన్.జి.సికి చెందిన పలు కర్మాగారాలు ఇక్కడ కలవు. హోప్ ఐలాండ్: కాకినాడ తీర ప్రాంతం అంతా హోప్ ఐలాండ్ (హోప్ ద్వీపం) చేత పరిరక్షింపబడుతున్నది. బంగాళాఖాతము ఆటుపోట్ల నుండి తీరము కోత కొయ్యబడకుండా ఈ హోప్ ఐలాండ్ ఏర్పడిందని తెలుస్తున్నది. ఈ హోప్ ఐలాండ్ తీరం వెంబడి 23 కి.మీల మేర విస్తరించి ఉన్నది. కాకినాడ సముద్రతీరంలో ఓడలు నిలిచినప్పుడు ఈ హోప్ ఐలాండ్ వల్ల ఓడలు లంగరు వేసినప్పుడు స్థిరంగా ఉండగల్గుతున్నాయి.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
15, జనవరి 2014, బుధవారం
కాకినాడ (Kakinada)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి