19, జనవరి 2014, ఆదివారం

మంగనూరు (Manganur)

మంగనూరు గ్రామము
గ్రామముమంగనూరు 
మండలముబిజినేపల్లి
జిల్లామహబూబ్‌నగర్
జనాభా6010 (2001)
6912 (2011)
మంగనూరు మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.గ్రామ విస్తీర్ణము 2214 హెక్టార్లు. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6912.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామం భౌగోళికంగా మండలం వాయువ్య భాగంలో ఘన్‌పూర్ మరియు తిమ్మాజీపేట మండలాల సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున వెల్గొండ, దక్షిణాన లాట్‌పల్లి గ్రామాలు, ఉత్తరాన తిమ్మాజీపేట మండలం, పశ్చిమాన ఘన్‌పూర్ మండలం మరియు గౌరారం గ్రామాలు సరిహద్దులుగాఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6010. ఇందులో పురుషులు 3061, మహిళలు 2949, గృహాలసంఖ్య 1184.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6912. ఇందులో పురుషులు 3494, మహిళలు 3418, గృహాల సంఖ్య 1483. అక్షరాస్యత శాతం 45.12%. గ్రామ కోడ్ సంఖ్య 575746.

రవాణా సౌకర్యాలు:
మహబూబ్‌నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు ప్రధాన రహదారి గ్రామం మీదుగా వెళ్ళుచున్నది. ఆర్టీసి మరియు ప్రైవేటు వాహనాలు గ్రామస్థులకు అందుబాటులో ఉన్నాయి.

రాజకీయాలు:
2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా బి.మధుసూదనమ్మ ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
గ్రామంలో 2 మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు, శ్రీప్రగతి విద్యాలయ, శ్రీసరస్వతి విద్యానికేతన్, ఆంధ్రప్రదేశ్ గిరిజన మినీ గురుకుల పాఠశాల, శ్రివాణి విద్యానికేతన్ ఎయిడెడ్ పాఠశాల, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉన్నాయి.

విభాగాలు: బిజినేపల్లి మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • నాగర్‌కర్నూల్ గ్రామాలు, చరిత్ర (రచన:కపిలవాయి కిశోర్ బాబు),
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక