4, జనవరి 2014, శనివారం

మంథని అసెంబ్లీ నియోజకవర్గం (Manthani Assembly Constituency)

మంథని అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఈ నియోజవర్గంలో 6 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహరావు ఇక్కడి నుంచి 4 సార్లు గెలుపొందినారు. ఇక్కడి నుంచి గెలుపొందిన దుద్దిల్ల శ్రీపాదరావు శాసనసభ స్పీకరుగా పనిచేయగా, దుద్దిల్ల శ్రీధర్ బాబు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 6 మండలాలు కలవు.
  • కమాన్‌పూర్,
  • మంథని,
  • కాటారం,
  • మహాదేవ్‌పూర్,
  • ముత్తారం,
  • మల్‌హర్‌రావు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 గులుకోట శ్రీరాములు సోషలిస్టు పార్టీ

1957 పి.వి.నరసింహరావు కాంగ్రెస్ పార్టీ

1962 పి.వి.నరసింహరావు కాంగ్రెస్ పార్టీ

1967 పి.వి.నరసింహరావు కాంగ్రెస్ పార్టీ

1972 పి.వి.నరసింహరావు కాంగ్రెస్ పార్టీ

1978 చందుపట్ల నారాయణరెడ్డి కాంగ్రెస్ ఐ

1983 దుద్దిల్ల శ్రీపాదరావు కాంగ్రెస్ పార్టీ

1985 దుద్దిల్ల శ్రీపాదరావు కాంగ్రెస్ పార్టీ

1989 దుద్దిల్ల శ్రీపాదరావు కాంగ్రెస్ పార్టీ

1994 చందుపట్ల రాంరెడ్డి తెలుగుదేశం పార్టి దుద్దిల్ల శ్రీపాదరావు కాంగ్రెస్ పార్టీ
1999 దుద్దిల్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ

2004 దుద్దిల్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ
2009 దుద్దిల్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ పుట్టామధు ప్రజారాజ్యం పార్టీ
2014 పుట్టామధు తెరాస దుద్దిల్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీధర్ బాబు తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కల్వసోమాపుర సత్యనారాయణపై 42560 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. శ్రీధర్ బాబుకు 79318 ఓట్లు రాగా, సత్యనారాయణకు 36758 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు తన సమీప ప్రత్యర్థి, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అయిన పుట్టామధుపై 13149 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి వరసగా 3వ సారి శాసనసభలో ప్రవేశించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస అభ్యర్థి పుట్టా మధు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, శాసనసభ స్పీకర్‌గా, ప్రభుత్వ విప్‌గా పనిచేసిన  దుద్దిల్ల శ్రీధర్ బాబుపై 19366 ఓట్ల మెజారిటితో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.


విభాగాలు: కరీంనగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం, మంథని అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక