పద్మజా నాయుడు 1900, నవంబరు 17న హైదరాబాదులో జన్మించారు. తల్లి సరోజినీ నాయుడు వలె ఈమె కూడా దేశశ్రేయస్సు కోసం పాటుపడింది. 21 సంవత్సరాల వయస్సులోనే జాతీయ స్థాయిలో ఖాదీ ప్రచారం కల్పించింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో, మరియు ఖాదీ ప్రచారంలోనూ చురుకుగా పాల్గొన్నారు. 1947-48లో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. 1956-67 కాలంలో పశ్చిమ బెంగాల్ గవర్నరుగా పనిచేశారు. అంతకు ముందు పార్లమెంటు సభ్యులుగా వ్యవహరించారు. రెడ్‌క్రాస్‌లోనూ కృషిచేసి 1971-72లో భారత రెడ్‌క్రాస్ చైర్మెన్‌గా వ్యవహరించారు. ఈమె సేవలకు గుర్తింపుగా డార్జిలింగ్‌లోని ఒక పార్కుకు పద్మజానాయుడు పేరు పెట్టబడింది. 1962లో భారత ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్ పురస్కారం పొందారు. మే 2, 1975న పద్మజానాయుడు కొత్త ఢిల్లీలో మరణించారు. పద్మజానాయుడికి జిన్నా భార్యతో మరియు నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్‌తో సన్నిహిత సంబందాలుండేవి. జవహల్‌లాల్ నెహ్రూతో కూడా సన్నిహితంగా మెలిగినట్లు పలువులు చరిత్రకారులు పేర్కొనగా, చరిత్రకారుడు పపుల్ జయకర్ మాత్రం గవర్నర్ పదవి విరమణ నుంచి మరణించే వరకు నెహ్రూతో కలిసి ఉండిందని పేర్కొన్నారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
Tags: Padmaji naidu in telugu, Padmaji Naidu Essay,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి