హైదరాబాదు దళిత ఉద్యమ పితామహుడిగా పేరుపొందిన భాగ్యరెడ్డివర్మ ఏకైక కుమారుడైన ఎం.బి.గౌతం (మాదరి భాగ్య గౌతం) 1913, ఆగస్టు 22న హైదరాబాదులో జన్మించారు. నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ, నిజాం వ్యతిరేక పోరాటంలోనూ చురుకుగా పాల్గొని జైలుశిక్ష కూడా అనుభవించారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా జీవితం ఆరంభించి, తండ్రి పేరిట భాగ్య స్మారక బాలికల ప్రత్యేక పాఠశాలను ప్రారంభించి జీవితాంతం నడిపారు. హైదరాబాదులో ఆది హిందూ భవనం క్రేందం నిర్వాహకుడుగానూ వ్యహరించారు. పలు సమాజసేవ కార్యక్రమాలలో పాలొన్నారు. ఇతని సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1972లో పద్మశ్రీ పురస్కార అందజేసింది. 2010లో గౌతం మరణించారు.
రాజకీయ ప్రస్థానం: ఎం.బి.గౌతమ్ హైదరాబాదు సంస్థాన రాజకీయాలలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. 1952లో జరిగిన మొట్టమొదటి శాసనసభా ఎన్నికలలో ఇబ్రహీంపట్నం ద్విసభ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యారు. బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలోని హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూసంస్కరణల సంఘంలో గౌతమ్ సభ్యుడిగా వ్యవహరించారు. దళితులకు, పేదలకు భూములు దక్కడానికి ఆ కమీషన్ సభ్యుడిగా ఆయన శ్లాఘనీయమైన కృషి చేశారు. 1962లో శాసనమండలికి ఎన్నికయ్యారు. 1971 లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా నియమించబడ్డారు.
|
18, జనవరి 2014, శనివారం
ఎం.బి.గౌతం (M.B.Gautham)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి