24, జనవరి 2014, శుక్రవారం

పుల్లెల గోపీచంద్ (Pullela Gopichand)

 పుల్లెల గోపీచంద్
జననంనవంబర్ 16, 1973
రంగంబ్యాడ్మింటన్ క్రీడాకారుడు, శిక్షకుడు,
విజయాలుఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
గుర్తింపులుపద్మభూషణ్, ద్రోణాచార్య అవార్డు, రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు, అర్జున అవార్డు,
భారతదేశానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన పుల్లెల గోపీచంద్ 1973 నవంబర్ 16న  ప్రకాశం జిల్లా నాగండ్లలో జన్మించారు. 2001 లో చైనాకు చెందిన చెన్‌హాంగ్ ను ఓడించి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెల్చి ప్రకాష్ పడుకొనె తర్వాత ఈ ఘనతను సాధించిన రెండో భారతీయుడిగా నిల్చినారు.

ఆయన క్రీడాప్రతిభకు గుర్తింపుగా 1999లో అర్జున పురస్కారము, 2000-01 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు లభించాయి. 2005 లో భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం గోపీచంద్ పుల్లెల్ల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని నిర్వహిస్తున్నారు. శిష్యురాలు సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ రంగములో తన ప్రతిభను చాటుతున్నది. ఈయన శిక్షణకు కూడా గుర్తించి 2009లో భారత ప్రభుత్వము గోపీచంద్ కు "ద్రోణాచార్య పురస్కారము" ప్రకటించింది. 2014 లో ఈయనకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు లభించింది.




విభాగాలు: బ్యాడ్మింటన్ క్రీడాకారులు, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు, 1973లో జన్మించినవారు, ప్రకాశం జిల్లా ప్రముఖులు, రాజీవ్‌గాంధీఖేల్ రత్న అవార్డు గ్రహీతలు, అర్జున అవార్డు గ్రహీతలు, పద్మభూషణ్ గ్రహీతలు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక