23, జనవరి 2014, గురువారం

వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం (Vemulawada Assembly Constituency)

వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2009 నియోజకవర్గాల పునర్విభనలో ఇది కొత్తగా ఏర్పాటైంది. ఈ నియోజవర్గంలో 5 మండలాలు కలవు. ఈ సెగ్మెంట్ కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 5 మండలాలు కలవు.
  • వేములవాడ,
  • కోనారావుపేట,
  • చందుర్తి,
  • కతలాపూర్,
  • మేడిపల్లి,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 చెన్నమనేని రమేష్ తెలుగుదేశం పార్టీ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ
2010* చెన్నమనేని రమేష్ తెరాస ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ
2014 చెన్నమనేని రమేష్ తెరాస ఆది శ్రీనివాస్ భాజపా

2009 ఎన్నికలు:

2009 శాసనసభ ఎన్నికలలో ఈ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెన్నమనేని రమేష్ (సీనియర్ నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు కుమారుడు) తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వేములవాడ దేవస్థానం మాజీ చైర్మెన్ అయిన ఆది శ్రీనివాస్ పై 1829 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. భాజపా తరఫున చెన్నమనేని విద్యాసాగర్ రావు, ప్రజారాజ్యం పార్టీ తరఫున జడ్పీ వైస్-చైర్మెన్ తీగల రవీందర్ రెడ్డి పోటీచేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రమేష్ పార్టీకి, పదవికి రాజీనామా చేయగా స్పీకర్ ఫిబ్రవరి 15, 2010న ఆమోదించారు.

2010 ఉప ఎన్నికలు:
జూలై 2010లో జరిగిన ఉప ఎన్నికలలో తెదేపా నుంచి విజయం సాధించి రాజీనామా చేసిన చెన్నమనేని రమేష్ తెరాస తరఫున పోటీచేసి సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆది శ్రీనివాస్ పై 50 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. రమేష్ కు 79146 ఓట్లు రాగా, శ్రీనివాస్ కు 28695 ఓట్లు లభించాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవనకొండ శ్రీనివాస్ 8759 ఓట్లు మాత్రమే పొంది డిపాజిట్ కోల్పోయారు. ఈ ఎన్నికలలో భాజపా తెరాసకు మద్దతు ఇచ్చింది.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తన సమీప ప్రత్యర్థి, భాజపాకు చెందిన ఆది శ్రీనివాస్‌పై 5268 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.


విభాగాలు: కరీంనగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, కరీంనగర్ లోకసభ నియోజకవర్గం, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక