టి.సుబ్బరామిరెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు రాజకీయ నాయకుడు. సెప్టెంబరు 17, 1943న నెల్లూరు జిల్లా అల్లూరులో జన్మించిన సుబ్బరామిరెడ్డి తన అన్నయ్య టి.చంద్రశేఖర్ రెడ్డి మరణానంతరం 18 ఏళ్ళ వయస్సులోనే వ్యాపారరంగంలో ప్రవేశించారు. పవర్ ప్రాజెక్టులు, హోటళ్ళు, టౌన్‌షిప్‌లు తదితర రంగాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాదులోని మహేశ్వరి, పరమేశ్వరి జంట థియేటర్లు కూడా ఈయనే నిర్మించారు. ఈయన టీఎస్సార్ గా ప్రసిద్ధి చెందారు.
రాజకీయ ప్రస్థానం: టీఎస్సార్ 1996, 1998లలో విశాఖపట్టణం లోకసభ నియోజకవర్గం నుంచి 2 సార్లు విజయం సాధించారు. 2002, 2008లలో రెండుసార్లు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. 2014 జనవరిలో మూడవసారి రాజ్యసభ సభ్యులుగా అవకాశం లభించింది. కేంద్రంలో గనులశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సినిమాలు, భక్తిభావం: టీఎస్సార్‌కు హిందూమతం పైనా, భక్తిభావం పైనా ఎనలేని గౌరవం ఉంది. భగవద్గీత, స్వామి వివేకానంద జీవితచరిత్రను సామాన్యులకు అర్థమయ్యే రీతిలో సినిమాలు నిర్మించారు. 1978లో హైదరాబాదులో మహేశ్వరి, పరమేశ్వరి జంట థియేటర్లు నిర్మించారు. ఈయన తీసిన భగవద్గీత సినిమా 1993లో జాతీయ స్థాయిలో స్వర్ణకమలం బహుమతిని అందుకుంది.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
25, జనవరి 2014, శనివారం
టి.సుబ్బరామిరెడ్డి (T,Subbarami Reddy)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి