5, జనవరి 2014, ఆదివారం

ఉట్కూరు (Utkoor)

 ఉట్కూరు గ్రామము
గ్రామముఉట్కూరు 
మండలముఉట్కూర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా11478 (2001)
12562 (2011)
ఉట్కూరు మహబూబ్‌నగర్ జిల్లా ఉట్కూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామంలో కోట ఉంది. ఇది లోకపల్లి సంస్థానంలో భాగంగా ఉండేది. రాజకీయ నాయకులు జి.నింగిరెడ్డి, ఎల్కోటి ఎల్లారెడ్డి ఈ గ్రామానికి చెందినవారు.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11478. ఇందులో పురుషులు 5736, మహిళలు 5742. గృహాల సంఖ్య 2091.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 12562. ఇందులో పురుషులు 6250, మహిళలు 6312. గృహాల సంఖ్య 2439. అక్షరాస్యత శాతం 50.57%. గ్రామ కోడ్ సంఖ్య 575479.

రాజకీయాలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి 1465 ఓట్ల ఆధిక్యత లభించింది.
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా ఎం.భాస్కర్ ఎన్నికయ్యారు.

గ్రామ ప్రముఖులు:
జి.నింగిరెడ్డి: మండలానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. 2001లో భారతీయ జనతాపార్టీ తరఫున జడ్పీటీసిగా ఎన్నికై జిల్లాపరిషత్తు వైస్-చైర్మెన్ అయ్యారు (తెదేపా మద్దతుతో). 2009 శాసనసభ ఎన్నికలలో మక్తల్ నుంచి పోటీచేశారు.
ఎల్కోటి ఎల్లారెడ్డి: ఉట్కూరు సర్పంచిగా, మక్తల్ సమితి అధ్యక్షుడిగా, 1994, 1999, 2009లలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1997లో రాష్ట్ర కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 2004లో లోకసభకు పోటీచేసి ఓడిపోయారు.


విభాగాలు: ఉట్కూరు  మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక