19, జనవరి 2014, ఆదివారం

వట్టెం (Vattem)

వట్టెం గ్రామము
గ్రామమువట్టెం 
మండలముబిజినేపల్లి
జిల్లామహబూబ్‌నగర్
జనాభా4180 (2001)
4918 (2011)
వట్టెం మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.గ్రామ విస్తీర్ణము 2445 హెక్టార్లు. ఇక్కడ ప్రముఖమైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ప్రముఖ కవి ఖండవల్లి నరసింహశాస్త్రి ఈ గ్రామమునకు చెందినవారు. వట్టెం గ్రామం ఒకప్పుడు వేదవేదాంగాలు అభ్యసించిన పండితులకు, కవివరేణ్యులకు పేరుపొందింది. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4918.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామం భౌగోళికంగా మండలం ఉత్తర భాగంలో తిమ్మాజీపేట మండలం సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున అనేఖాన్‌పల్లి, కారుకొండ, దక్షిణాన బిజినేపల్లి, పశ్చిమాన వెల్గొండ గ్రామాలు, ఉత్తరాన తిమ్మాజీపేట మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:

2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4180. ఇందులో పురుషులు 2095, మహిళలు 2085, గృహాలసంఖ్య 878.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4918. ఇందులో పురుషులు 2450, మహిళలు 2468, గృహాల సంఖ్య 1043. అక్షరాస్యత శాతం 43.19%. గ్రామ కోడ్ సంఖ్య 575748.

రవాణా సౌకర్యాలు:
జడ్చర్ల-బిజినేపల్లి రహదారి (హైదరాబాదు నుంచి వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్ వెళ్ళే రహదారిలో భాగము) గ్రామం మీదుగా వెళ్ళుచున్నది. ఆర్టీసి బస్సులు మరియు ప్రైవేటు వాహనాలు గ్రామస్థులకు అందుబాటులో ఉన్నాయి.

విద్యాసంస్థలు:
గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, మండల పరిషత్తు బాలికల ప్రాథమికోన్నత పాఠశాల, 2 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు,  చైతన్య మోడల్ స్కూల్, జవహర్ నవోదయ విద్యాలయ ఉన్నాయి. కల్వకుంట తండా, రాంరెడ్డి తండాలలో ప్రాథమిక పాఠశాలలున్నాయి.

ప్రధాన సంఘటనలు:

  • 2002: బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి బ్రిటన్ ప్రధానమంత్రి టోని బ్లెయిర్ వచ్చారు.

విభాగాలు: బిజినేపల్లి మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • నాగర్‌కర్నూల్ గ్రామాలు, చరిత్ర (రచన:కపిలవాయి కిశోర్ బాబు),
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక