13, ఫిబ్రవరి 2014, గురువారం

అయ్యదేవర కాళేశ్వరరావు (Ayyadevara Kaleshwar Rao)

 అయ్యదేవర కాళేశ్వరరావు
(1882-1962)
జననంజనవరి 22, 1882
స్వస్థలంనందిగామ
రంగంసమరయోధుడు, రాజకీయ నాయకుడు,
పదవులుఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు,
మరణంఫిబ్రవరి 26, 1962
స్వాతంత్ర్య సమరయోధుడుగా, రాజకీయ నాయకుడిగా ప్రసిద్ధి చెందిన అయ్యదేవర కాళేశ్వరరావు జనవరి 22, 1882న కృష్ణా జిల్లా నందిగామలో జన్మించారు. ప్రారంభంలో ఉపాధ్యాయుడిగా, న్యాయవాదిగా పనిచేసి జాతీయోద్యమంలో ప్రవేశించారు. స్వాతంత్ర్యానికి పూర్వమే మద్రాసు శాసనసభకు ఎన్నికైనారు. 1955 లో ఆంధ్రరాష్ట్ర శాసనసభకు పోటీచేసి విజయం సాధించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకరుగా పనిచేశారు. ఫిబ్రవరి 26, 1962న మరణించారు. ఈయన జీవితచరిత్రపై "నవ్యాంధ్ర - నా జీవిత కథ" వెలువడింది.

బాల్యం, విద్యాభ్యాసం:
అయ్యదేవర కాళేశ్వరరావు జనవరి 22, 1882న కృష్ణా జిల్లా నందిగామలో జన్మించారు. బి.ఎ.ఉత్తీర్ణులై తొలుత ఉపాధ్యాయులుగా, బీఎల్ పూర్తయిన పిదప న్యాయవాదిగా పనిచేశారు. పలు సంఘసంస్కరణ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

స్వాతంత్ర్యోద్యమం:
కాళేశ్వరరావు స్వాతంత్ర్య సంగ్రామంలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలోను, హోంరూలు ఉద్యమంలోను వీరు పనిచేసి కారాగారశిక్ష కూడా అనుభవించారు. కారాగారంలో ఉండగా 'ఫ్రెంచి విప్లవ చరిత్ర', 'అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర', 'తురుష్క ప్రజాస్వామికం', చీనా జాతీయోద్యమ చరిత్ర' మరియు 'ఈజిప్టు చరిత్ర' అను పుస్తకాలను రచించారు.

రాజకీయ ప్రస్థానం:
1926, 1937, 1946, 1955 సంవత్సరాలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయవాడకు ప్రాతినిధ్యం వహించారు. ప్రజా ప్రతినిధిగా ఇతను విజయవాడ పురపాలక సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. ఈయన విజయవాడ పురపాలక సంఘ అధ్యక్షుడిగానూ, మద్రాసు శాసనసభకు చీఫ్ విప్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. మద్రాసు ముఖ్యమంత్రిగా ఉన్న రాజగోపాలచారికి కార్యదర్శిగా వ్యవహరించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన తర్వాత శాసనసభ తొలి స్పీకరుగా ఎన్నికై మరణించేవరకు ఆ పదవిలోనే ఉన్నారు. 1962 శాసనసభ ఎన్నికలలో పోటీచేసి ఫలితాలు వెలువడడానికి ఒకరోజు ముందే ఫిబ్రవరి 26, 1962న మరణించారు..



విభాగాలు: కృష్ణా జిల్లా సమరయోధులు, కృష్ణా జిల్లా రాజకీయ నాయకులు, విజయవాడ అసెంబ్లీ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు, 1వ శాసనసభ సభ్యులు, 2వ శాసనసభ సభ్యులు, 882లో జన్మించినవారు, 1962లో మరణించినవారు, 


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక