2, ఫిబ్రవరి 2014, ఆదివారం

సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం (Sirisilla Assembly Constituency)

సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజవర్గంలో 4 మండలాలు కలవు. ఈ సెగ్మెంట్ కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. చేనేత మగ్గాలపై ఆధారపడి జీవనం సాగించేవారు నియోజకవర్గంలో ఎక్కువసంఖ్యలో ఉన్నారు. సీనియర్ నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు ఇక్కడి నుంచి 5 సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం కెసిఆర్ కుమారుడు కె.తారక రామారావు ఈ నియోజకర్గానికి ప్రాతినిధ్యం వహించారు.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 4 మండలాలు కలవు.
 • ఎల్లారెడ్డిపేట,
 • గంభీర్‌రావుపేట్,
 • ముస్తాబాద్,
 • సిరిసిల్ల,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
195219571962 జె.నర్సింగ్ రావు కాంగ్రెస్ పార్టీ

1967 సీహెచ్ రాజేశ్వరరావు సీపీఐ

1972 జె.నర్సింగ్ రావు కాంగ్రెస్ పార్టీ సీహెచ్ రాజేశ్వరరావు సీపీఐ
1978 సీహెచ్ రాజేశ్వరరావు సీపీఐ

1983 వి.మోహన్ గౌడ్ తెలుగుదేశం ఫార్టీ ఆర్.పాపారావు
1985 సీహెచ్ రాజేశ్వరరావు సీపీఐ

1989 ఎన్.వి.కృష్ణయ్య ఇండిపెండెంట్ ఆర్.పాపారావు
1994 సీహెచ్ రాజేశ్వరరావు సీపీఐ ఆర్.పాపారావు
1999 ఆర్.పాపారావు కాంగ్రెస్ పార్టీ సీహెచ్ రాజేశ్వరరావు తెలుగుదేశం ఫార్టీ
2004 సీహెచ్ రాజేశ్వరరావు తెలుగుదేశం ఫార్టీ ఆర్.పాపారావు తెరాస
2009 కె.తారక రామారావు తెరాస కె.కె.మహేందర్ రెడ్డి ఇండిపెండెంట్
2010* కె.తారక రామారావు తెరాస కె.కె.మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 కె.తారక రామారావు తెరాస రవీందర్ రావు కాంగ్రెస్ పార్టీ

1999 ఎన్నికలు:
1999 ఎన్నికలలో సిట్టింగ్ శాసనసభ్యుడు సీనియర్ సి.పి.ఐ. నేత సీహెచ్. రాజేశ్వరరావు తెలుగుదేశం పార్టీ టికెట్టుతో పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటి చైర్మెన్ అయిన ఆర్.పాపారావు చేతిలో 9561 ఓట్ల తేడాతో పరాజయం పొందినారు.

2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన చెన్నమనేని రాజేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి రేగులపాటి పాపారావుపై 17008 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. రాజేశ్వరరావుకు 64003 ఓట్లు రాగా, పాపారావుకు 46995 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కె.సి.ఆర్.కుమారుడు కె.తారక రామారావు తన సమీప ప్రత్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన కె.కె.మహేందర్ రెడ్డిపై 171 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించారు. తెరాస తరఫున మహేందర్ రెడ్డికే టికెట్ లభిస్తుందన్న తరుణంలో కెటీఆర్ తెరపైకి రావడంతో మహేందర్ రెడ్డి ఇండిపెండెంటుగా పోటీచేసి బలమైన పోటీ ఇచ్చారు. సిపిఐ కూడా మహేందర్ రెడ్డికే మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరఫున గుడ్ల మంజుల పోటీచేశారు. ఈమె పురపాలక సంఘం చైర్మెన్ పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కెటిఆర్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయగా 2010లో ఉప ఎన్నికలు జరిగాయి.

2010 ఉప ఎన్నికలు:
జూలై 27న జరిగిన ఉప ఎన్నికలలో తెరాస తరఫున కె.తారక రామారావు మళ్ళీ పోటీచేయగా, 2009లో ఇండీపెండెంటుగా పోటీచేసి బలమైన పోటీ ఇచ్చిన కె.కె.మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేశారు. కెటిఆర్ మహేందర్ రెడ్డిపై 58వేల భారీ మెజారిటీతో విజయం సాధించారు. తారక రామారావుకు 87876 ఓట్లు రాగా, మహేందర్ రెడ్డికి 19657 ఓట్లు లభించాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్టా కిశోర్ 3509 ఓట్లు మాత్రమే పొంది డిపాజిట్ కోల్పోయారు. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తెరాసకు మద్దతు ఇచ్చింది. మొత్తం 78 అభ్యర్థులు పోటీచేశారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస తరఫున పోటీచేసిన కెసీఆర్ కుమారుడు, సిటింగ్ ఎమ్మెల్యే అయిన కె.తారక రామారావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన రవీందర్ రావుపై 52734 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: కరీంనగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, కరీంనగర్ లోకసభ నియోజకవర్గం, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక