2, ఫిబ్రవరి 2014, ఆదివారం

చుక్కారామయ్య (Chukka Ramaiah)

చుక్కారామయ్య
జననంనవంబర్ 20, 1925
స్వస్థలంగూడూరు (పాలకుర్తి మండలం)
ప్రముఖ విద్యాచేత్త చుక్కా రామయ్య నవంబర్ 20, 1925న జనగామ జిల్లా గూడూరు గ్రామంలో జన్మించారు. రామయ్య తన స్వస్థలమైన గూడూరులో మూడవ తరగతి వరకూ చదివారు. డిగ్రీ, మరియు ఎం.ఎస్.సి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేసారు. హైదరాబాదు సంస్థానంలో భూస్వామ్య వ్యవస్థకు, నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళారు. ప్రిన్సిపాల్‌గా పదవీవిరమణ పొందిన తర్వాత హైదరాబాదులో ఐఐటి శిక్షణ సంస్థను నెలకొల్పి ఐఐటి రామయ్యగా ప్రసిద్ధిచెందారు. రచయితగా పలు పుస్తకాలు రచించారు. 2007లో శాసనమండలికి ఎన్నికయ్యారు.

జనగామలో ఉపాధ్యాయుడిగా చేరి తెలంగాణలోని అనేక పాఠశాలల్లో పనిచేసారు. 1983 లో నాగార్జునసాగర్ లోని రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసారు. ఉద్యోగంలో ఉండగా ఉపాధ్యాయ సంఘాల్లో చురుగ్గా ఉండేవారు.
ఈయన ఐఐటి కోచింగ్ లో ప్రసిద్దులు. నల్లకుంటలో శిక్షణా కేంద్రం కలదు.

ఐఐటి కోచింగ్:
హైదరాబాదు, నల్లకుంటలో స్థిరపడి, ఐ.ఐ.టి జె.ఇ.ఇ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్ధులకు గణితము బోధించడం మొదలుపెట్టారు. ఆ విద్యార్థులు ప్రవేశపరీక్షలో చక్కటి విజయాలను సాధించడంతో ఆయన చాలా ప్రఖ్యాతి పొందారు. చుక్కా రామయ్య విద్యా సంస్థ బాగా వృద్ధి చెందింది. ఈ సంస్థ నుండి వేలాదిగా విద్యార్ధులు ఐ.ఐ.టిలలో ప్రవేశించారు. రామయ్య ఇన్స్టిట్యూట్ లో చేరేందుకు ఒక ప్రవేశ పరీక్ష నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ పరీక్ష కోసం శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా సంస్థలు కూడా స్థాపింబడ్డాయి. ఐఐటీ ప్రవేశ పరీక్షలో తన సంస్థ సాధించిన విజయాల కారణంగా చుక్కా రామయ్య, ’’ఐఐటి రామయ్య’’గా ప్రసిద్ధి చెందారు.


ఇవి కూడా చూడండి:
  • శకుంతలాదేవి (హ్యూమన్ కంప్యూటర్),


విభాగాలు: జనగామ జిల్లా ప్రముఖులు, శాసనమండలి సభ్యులు, 1925లో జన్మించినవారు, 


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక