5, ఫిబ్రవరి 2014, బుధవారం

ఉప్పునూతల (Uppunuthala)

ఉప్పునూతల గ్రామము
గ్రామముఉప్పునూతల
మండలముఉప్పునూతల 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా4988 (2001)
6205 (2011)
ఉప్పునూతల మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది పంచాయతి కేంద్రము. మండలంలో ఇది పెద్ద గ్రామము. గ్రామ భౌగోళిక విస్తీర్ణం 813 హెక్టార్లు. 1987లో మండల తొలి ఎంపీపీగా ఈ గ్రామానికి చెందిన కట్టా జనార్థన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన 4 సార్లు గ్రామ సర్పంచిగా పనిచేశారు.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4988. ఇందులో పురుషులు 2538, మహిళలు 2450. గృహాల సంఖ్య 1056.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 6205. ఇందులో పురుషులు 3155, మహిళలు 3050. గృహాల సంఖ్య 1341. అక్షరాస్యత శాతం 45.04%. గ్రామకోడ్ సంఖ్య 575673.

చరిత్ర:
ఉప్పునూతల కేదేశ్వరాలయం
ఉప్పునూతల చారిత్రకమైన గ్రామము. పూర్వం గ్రామంలో 4 కోటలుండేవి కాని ప్రస్తుతం ఒక్క శిథిలకోట మాత్రమే కనిపిస్తుంది. గ్రామం మధ్యలో ప్రాచీనమైన కేదేశ్వరాలయం ఉంది. ఆలయ స్తంబానికి శాసనం చెక్కబడింది. ప్రముఖ కవి కపిలవాయి లింగమూర్తి గ్రామచరిత్రపై "ఊపునూతల చరిత్ర" పుస్తకాన్ని రచించారు.

రాజకీయాలు:
2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా సి.యాదమ్మ ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
గ్రామంలో రెండు మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలు, ఒక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉన్నాయి. రంగంపేట, కొత్తరాంనగర్, గట్టుమీదితండా, దేవదారికుంట తండా, గట్టుకాడిపల్లి లలో ప్రాథమిక పాఠశాలలున్నాయి.

విభాగాలు: ఉప్పునూతల మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగు వికీపీడియా,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక