23, మార్చి 2014, ఆదివారం

గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం (Gajwel Assembly Constituency)

గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజవర్గంలో 6 మండలాలు కలవు. గతంలో ఎస్టీలకు రిజర్వ్ అయిన గజ్వేల్ నియోజకవర్గం 2009లో జనరల్ అయింది. ఈ సెగ్మెంట్ మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2014 మరియు 2018లలో ఇక్కడి నుంచి తెరాస తరఫున పోటీచేసిన పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి పదవి పొందారు.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన ఈ నియోజకవర్గం ప్రకారం పరిధిలో 6 మండలాలు కలవు.పునర్విభజనలో కొండపాక మండలం కొత్తగా చేరింది.
  • కొండపాక,
  • గజ్వేల్,
  • జగదేవ్‌పూర్,
  • వర్గల్,
  • ములుగు,
  • తోగుట,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2004 జెట్టి గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీ డి.దుర్గయ్య తెలుగుదేశం పార్టీ
2009 తూంకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2014 కె.చంద్రశేఖర్ రావు తెరాస వి.ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2018 కె.చంద్రశేఖర్ రావు తెరాస వి.ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు:2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి జెట్టి గీతారెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి.దుర్గయ్య ‌పై 24260 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. గీతారెడ్డి 71955 ఓట్లు సాధించగా, దుర్గయ్యకు 47695 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, డిసిసిబి చైర్మెన్ అయిన తూంకుంట నర్సారెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రతాప్ రెడ్డిపై 7135 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి మొదటిసారి శాసనసభలో ప్రవేశించారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించిన ఎలక్షన్ రెడ్డి టికెట్ లభించక పోవడంతో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీచేశారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి పోటీచేసిన తెరాస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన వి.ప్రతాప్ రెడ్డిపై 19218 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, భాజపా తరఫున ఆకుల విజయ, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీచేశారు. తెరాసకు చెందిన కె.చంద్రశేఖర్ రావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన వంటేరు ప్రతాప్ రెడ్డి పై 58290 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.




విభాగాలు: మెదక్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, మెదక్ లోకసభ నియోజకవర్గం, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక