1, మార్చి 2014, శనివారం

మాలతీ చందూర్ (Malathi Chandoor)

 మాలతీ చందూర్
(1930-2013)
జననం1930
స్వస్థలంనూజివీడు
రంగంరచయిత్రి
అవార్డులుకేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1992)
మరణంఆగస్టు 21, 2013
తెలుగు రచయిత్రిగా పేరుపొందిన మాలతీ చందూర్ 1930లో కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు. ఆంధ్రప్రభ వారపత్రికలో "ప్రమదావనం" శీర్షికను అత్యంత ఎక్కువకాలం నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. చీరాల పేరాల ఉద్యమ నేపథ్యంలో రచించిన "హృయదనేత్రి" నవలకు గాను 1992లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినారు. ఆగస్టు 21, 2013న చెన్నైలో మాలతీ చందూర్ మరణించారు.

బాల్యం:
మాలతీ 1930లో నూజివీడులో జన్మించి 8వ తరగతి వరకు అక్కడే అభ్యసించింది. ఆ తర్వాత ఏలూరు వెళ్ళింది. ఏలూరులో ఆమె ఉంటున్న ఇంటి సమీపంలో "కథావీధి" అనే సాహిత్య పత్రిక కార్యాలయం ఉండేది. అక్కడికి శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్తి, నండూరి సుబ్బారావు తదితరలు వస్తుండేవారు. వీరి ప్రభావం ఈమెపై పడింది. 1947లో చందూర్‌తో వివాహం జరిగిన తర్వాత చెన్నై వెళ్ళిపోయారు. 1949లో రచనలు ప్రారంభించారు.

రచనలు:
ఆంధ్రప్రభ వారపత్రికలో "ప్రమదావనం" పేరుతో రెండు దశాబ్దాలకుపైగా శీర్షిక నిర్వహించింది. ఈ శీర్షికలో వంటలు, వార్పులే కాకుండా ఇంగ్లీషు నవలలను పరిచయం చెయ్యటం, విదేశాలలో తిరిగి వచ్చిన వారి చేత వారి అనుభవాలు రాయించటం మొదలైనవి చేస్తూ ఆడవారికి ఒక సలహాదారుగా ఉండి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేది. పలు పుస్తకాలు, నవలలు కూడారచించారు. 1992లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన మాలతీ చందూర్ ఆగస్టు 21, 2013న చెన్నైలో మరణించారు.



విభాగాలు: తెలుగు రచయితలు, కృష్ణా జిల్లా ప్ర్తముఖులు, నూజివీడు, 1930లో జన్మించినవారు, 2013లో మరణించినవారు, 


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగు వికీపీడియా,
  • తెలుగు రచయితలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక