27, మార్చి 2014, గురువారం

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)

 పవన్ కళ్యాణ్
జననంసెప్టెంబరు 2, 1973
రంగంసినిమా, రాజకీయాలు,
పార్టీజనసేన పార్టీ
ప్రముఖ సినిమా నటుడిఫా పేరుపొందిన పవన్ కళ్యాణ్ సెప్టెంబరు 2, 1973న జన్మించారు. పవన్ సోదరుడు చిరంజీవి (కొణిదెల శివప్రసాద్) మరియు నాగేంద్రబాబులు కూడా తెలుగు సినిమా రంగంలో ప్రఖ్యాతిగాంచారు. 1996లో "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" ద్వారా సినీ రంగంలో ప్రవేశించిన పవన్ కళ్యాణ్ ఉత్తమ నటనతో పలు అవార్డులు కూడా పొందినారు. 2009 ఎన్నికల సమయంలో సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారం చేశారు. 2014 మార్చిలో "జనసేన పార్టీ" పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు.

సినీ ప్రస్థానం:
1996లో పవన కళ్యాణ్ "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" సినిమా ద్వారా సినీరంగంలో ప్రవేశించారు. 1998లో ఈయన నటించిన తొలి ప్రేమ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. 2013లో గబ్బర్ సింగ్ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు పొందినారు. గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషీ, జల్సా పవన్ నటించిన కొన్ని హిట్ చిత్రాలు.

రాజకీయ ప్రస్థానం:
2009లో సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న జనసేన పార్టీ పేరుతో కొత్తగా రాజకీయ పార్టిని స్థాపించారు. 2019 శాసనసభ ఎన్నికలలో పవన్ నేతృత్వంలోని జనసేన పార్టీ రాష్ట్రం మొత్తం మీద ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. పవన్ స్వయంగా పోటీచేసిన 2 స్థానాలలోనూ పరాజయం పొందారు.

ఇవి కూడా చూడండి:


హోం,
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు, తెలుగు సినిమా నటులు, 1973లో జన్మించినవారు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక