19, మార్చి 2014, బుధవారం

పెబ్బేరు (Pebbair)

పెబ్బేరు గ్రామము
గ్రామముపెబ్బేరు 
మండలముపెబ్బేరు 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా 9869 (2001)
12289 (2011)
పెబ్బేరు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది పంచాయతి కేంద్రము. రెవెన్యూ గ్రామ విస్తీర్ణము 2113 హెక్టార్లు. డివిజన్ కేంద్రం వనపర్తి నుంచి 26 కిమీ దూరంలో ఉంది. గతంలో ఇది 7వె నెంబరు (కొత్త పేరు 44వ నెంబరు) జాతీయ రహదారిపై ఉండేది. జాతీయ రహదారి విస్తరణలో బైపాస్ ములంగా జాతీయ రహదారికి దూరమైంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9869. ఇందులో పురుషులు 5084, మహిళలు 4785. గృహాల సంఖ్య 1960.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 12289. ఇందులో పురుషులు 6275, మహిళలు 6014. గృహాల సంఖ్య 2681.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా అక్కి సుశీల ఎన్నికయ్యారు.

పెబ్బేరు సంత:
మహబూబ్ నగర్ జిల్లాలో పెబ్బేరు సంత ప్రధానమైనది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వ్యాపారులు కూడా ఈ సంతకు హాజరౌతారు. ప్రజాకవి గొరటి వెంకన్న ఈ సంతపై పాట కూడా రాశారు. ఈ సంత జిల్లాలో ప్రథమస్థానంలో, రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది. పశువులు, పొట్టేళ్ళు, కోళ్ళ క్రయవిక్రయాలకు ఇది ప్రసిద్ధి. ఇవే కాకుండా దాదాపు అన్ని రకాల వస్తువులు సంతలో లభిస్తాయి. ప్రతి శుక్రవారం అర్థరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు సంత జరుగుతుంది. మొదట మండలంలోని కృష్ణారెడ్డిపేటలో సంత నిర్వహించేవారు. ఒక హత్య కారణంతో 1982 నుంచి పెబ్బేరుకు మార్చినారు. మొదట రూ 40వేల ఆదాయం కల సంత ప్రస్తుతం కోటి రూపాయలకు చేరింది.

విద్యాసంస్థలు:

ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.

విభాగాలు: పెబ్బేరు మండలంలోని గ్రామాలు


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక