25, ఏప్రిల్ 2014, శుక్రవారం

ఈవూరి సీతారావమ్మ (Eevuri Seetaravamma)

ఈవూరి సీతారావమ్మ
జననండిసెంబరు 14, 1928
స్వస్థలంచెరుకుపల్లి
పదవులు3సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి,
మరణంమే 1, 2014
ఈవూరి సీతారావమ్మ గుంటూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు. ఈమె డిసెంబరు 14, 1928న జన్మించారు. కూచినపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరసగా 3 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికై హాట్రిక్ సాధించారు. చంద్రబాబు మంత్రివర్గంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. ఈమె భర్త కూడా ఇదే నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎన్నికయ్యారు. సీతారావమ్మ మే 1, 2014న మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
సీతారావమ్మ భర్త ఈవూరి సుబ్బారావు 1962, 1978లలో కూచినపూడి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచే సీతారావమ్మకు రాజకీయాలపై ఆసక్తి ఉంది. సీతారావమ్మ తొలిసారి 1985లో తెలుగుదేశం పార్టీ తరఫున కూచినపూడి నుంచి విజయం సాధించారు. ఇదే నియోజకవర్గం నుంచి 1989, 1994లలో కూడా వరస విజయాలు నమోదుచేశారు. 1995లో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో పోటీచేసి ఓడీపోయారు. 2004లో పార్టీ టికెట్ లభించలేదు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.


విభాగాలు: గుంటూరు జిల్లా రాజకీయ నాయకులు, కూచినపూడి అసెంబ్లీ నియోజకవర్గం, 8వ శాసనసభ సభ్యులు, 9వ శాసనసభ సభ్యులు, 10వ శాసనసభ సభ్యులు, 2014లో మరణించినవారు, 


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక