1, మే 2014, గురువారం

ముషీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం (Mushirabad Assembly Constituency)

ముషీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం హైదరాబాదు జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి.ఇది సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 57.


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2004 నాయిని నరసింహరెడ్డి తెరాస కె.లక్ష్మణ్ భాజపా
2008* టి.మణెమ్మ కాంగ్రెస్ పార్టీ కె.లక్ష్మణ్ భాజపా
2009 టి.మణెమ్మ కాంగ్రెస్ పార్టీ కె.లక్ష్మణ్ భాజపా
2014 కె.లక్ష్మణ్ భాజపా ముఠా గోపాల్ తెరాస
2018 ముఠా గోపాల్ తెరాస అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నాయిని నరసింహరెడ్డి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన కె.లక్ష్మణ్ పై 241 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందినారు. నరసింహరెడ్డికి 53552 ఓట్లు రాగా, లక్ష్మణ్ 53311 ఓట్లు సాధించారు.

2008 ఉపఎన్నికలు:
తెలంగాణ రాష్ట్రసమితి శాసనసభ్యుల మూకుమ్మడి రాజీనామా వలన ఏర్పడిన ఖాళీ వలన జరిగిన ఉపఎన్నికలలో ముషీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.మణెమ్మ భారతీయ జనతా పార్టీకి చెందిన లక్ష్మణ్ పై 2075 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మణెమ్మ 34795 ఓట్లు సాధించగా, లక్ష్మణ్ 32720 ఓట్లు పొందినారు. తెరాసకు చెందిన నాయిని నరసింహరెడ్డి 19867 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.


2009 ఎన్నికలు:
2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బిజెపీ నుండి కె.లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ తరపున టి.మణేమ్మలతోపాటు ప్రధాన పార్టీలైనా తెరాస, ప్రజారాజ్యం, లోక్ సత్తాలు పోటీచేశారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టంగుటూరి మణెమ్మ తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతాపార్టీకి చెందిన డా.లక్ష్మణ్‌పై 14342 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,42,016 కాగా పోలైన ఓట్ల సంఖ్య 1,32,769. దీనిలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన మణెమ్మకు 45,966కు, బిజెపి అభ్యర్థి లక్ష్మణ్ కు 31,123 ఓట్లను పొందారు. ఉపఎన్నికలతో పోలిస్తే దాదాపు 10 వేల పైచిలుకు ఓట్ల అధిక్యాన్ని మణెమ్మ పొందారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి భాజపాకు చెందిన కె.లక్ష్మణ్ తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన ముఠా గోపాల్‌పై 27378 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున ముఠా గోపాల్, భాజపా తరఫున కె.లక్ష్మణ్, ప్రజాఫ్రంట్ తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.అనిల్ కుమార్ యాదవ్ పోటీచేశారు. తెరాసకు చెందిన ముఠా గోపాల్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.అనిల్ కుమార్ యాదవ్ పై 36910 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు..


విభాగాలు: హైదరాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం, ముషీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక