5, ఏప్రిల్ 2014, శనివారం

మహబూబాబాదు అసెంబ్లీ నియోజకవర్గం (Mahabubabad Assembly Constituency)

మహబూబాబాదు అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 4 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ మహబూబాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. ఈ స్థానం ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • గూడూర్,
  • నెల్లికుదురు,
  • కేసముద్రం,
  • మహబూబాబాద్,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 మాలోత్ కవిత కాంగ్రెస్ పార్టీ అజ్మీరా చందూలాల్‌ తెలంగాణ రాష్ట్ర సమితి
2014 బానోత్ శంకర్ నాయక్ తెరాస మాలోత్ కవిత కాంగ్రెస్ పార్టీ
2018 బానోత్ శంకర్ నాయక్ తెరాస పోరిక బలరాంనాయక్ కాంగ్రెస్ పార్టీ


2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత (రాష్ట్ర మంత్రిగా పనిచేసిన రెడ్యానాయక్ కూతురు) తన సమీప ప్రత్యర్థి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ, అజ్మీరా చందూలాల్‌పై 15420 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన బానోత్ శంకర్ నాయక్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్య్ ఏఅయిన మాలోత్ కవితపై 9602 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున బానోర్ శంకర్ నాయక్, భాజపా తరఫున జె.హుస్సేన్ నాయక్, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన పోరిక బలరాంనాయక్ పోటీచేశారు. తెరాసకు చెందిన బానోత్ శంకర్ నాయక్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన పోరిక బలరాంనాయక్  పై 13534 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: వరంగల్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, మహబూబాబాదు లోకసభ నియోజకవర్గం, మహబూబాబాదు అసెంబ్లీ నియోజకవర్గం,

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక