18, ఏప్రిల్ 2014, శుక్రవారం

మసాల ఈరన్న (Masala Eeranna)

మసాల ఈరన్న
జననం1934
స్వస్థలంఆలూరు (కర్నూలు జిల్లా)
పదవులు3 సార్లు ఎమ్మెల్యే, జడ్పీ చైర్మెన్,
మరణంఏప్రిల్ 24, 2014
మసాల ఈరన్న కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 1934లో ఆలూరులో జన్మించిన మసాల ఈరన్న 3 సార్లు శాసనసభకు, ఒకసారి జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా ఎన్నికైనారు. దేవాలయాలలో దళితులకు ఆలయప్రవేశం, ఆర్టీసి బస్సులలో ఎమ్మెల్యే, ఎంపీలకు రిజర్వేషన్ కల్పించడానికి కృషిచేశారు. 80 సంవత్సరాల వయసులో ఏప్రిల్ 24, 2014న మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
1964లో రాజకీయ ప్రవేశం చేసిన మసాల ఈరన్న 1965లో ఆలూరు గ్రామపంచాయతి వార్డు సభ్యునిగా గెలుపొందారు. 1967 శాసనసభ ఎన్నికలలో ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంటుగా పోటీచేసి ఓడిపోయారు. 1970లో మరోసారి గ్రామపంచాయతి వార్డు సభ్యునిగా విజయం సాధించారు. 1978లో ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీచేసి జనతాపార్టీ అభ్యర్థిపై గెలుపొందినారు. 1983లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడీపోయారు. 1985లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై విజయం సాధించి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 1987లో జరిగిన జిల్లా పరిషత్తు చైర్మెన్ ప్రత్యక్ష ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికై 1992 వరకు పనిచేశారు. 1994లో ఆలూరు నుంచి 3వ సారి విజయం సాధించారు. 1999లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి మారెప్ప చేతిలో పరాజయం పొందారు. 2007లో ఆలూరు జడ్పీటీసిగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 


విభాగాలు: కర్నూలు జిల్లా ప్రముఖులు, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం, ఆలూరు మండలము, కర్నూలు జిల్లా పరిషత్తు చైర్మెన్లు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక