19, ఏప్రిల్ 2014, శనివారం

ములుగు అసెంబ్లీ నియోజకవర్గం (Mulugu Assembly Constituency)

ములుగు అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 7 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ మహబూబాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. భౌగోళికంగా జిల్లాలో ఇది అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గం.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • వెంకటాపూర్ మండలం,
  • ఏటూరునాగారం మండలం,
  • మంగపేట మండలం,
  • తాడ్వాయి మండలం,
  • గోవిందరావుపేట మండలం,
  • ములుగు మండలం,
  • కొగ్గగూడ మండలం,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1999 పొడెం వీరయ్య కాంగ్రెస్ పార్టీ అజ్మీరా చందూలాల్ తెలుగుదేశం పార్టీ
2004 పొడెం వీరయ్య కాంగ్రెస్ పార్టీ సీతక్క తెలుగుదేశం పార్టీ
2009 సీతక్క తెలుగుదేశం పార్టీ పొడెం వీరయ్య కాంగ్రెస్ పార్టీ
2014 అజ్మీరా చందూలాల్ తెరాస పొడెం వీరయ్య కాంగ్రెస్ పార్టీ
2018 డి.అనుసూయ (సీతక్క) కాంగ్రెస్ పార్టీ అజ్మీరా చందూలాల్ తెరాస


1999 ఎన్నికలు:1999 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొడెం వీరయ్య, తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన అజ్మీరా చందూలాల్ పై 14555 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. వీరయ్యకు 60166 ఓట్లు రాగా, చందూలాల్‌కు 45611 ఓట్లు లభించాయి.

2004 ఎన్నికలు:
2004 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొడెం వీరయ్య తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన సీతక్కపై 14594 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. వీరయ్యకు 55701 ఓట్లు రాగా, సీతక్కకు 41107 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీతక్క తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిటింగ్ ఎమ్మెల్యే పొడెం వీరయ్యపై 18775 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.


2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన అజ్మీరా చందూలాల్ తన సమీప ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పొదెం వీరయ్యపై 16314 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. డిసెంబరు 16, 2014న చందూలాల్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో గిరిజన శాఖ మంత్రిగా పదవి పొందారు.


2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున అజ్మీరా చందూలాల్, భాజపా తరఫున బానోత్ దేవీలాల్, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన డి.అనుసూయ పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన డి.అనుసూయ తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన చందూలాల్ అజ్మీరా పై 22671 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: వరంగల్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, మహబూబాబాదు లోకసభ నియోజకవర్గం, ములుగు అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక