3, ఏప్రిల్ 2014, గురువారం

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం (Munugode Assembly Constituency)

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 6 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
 • మునుగోడు,
 • నారాయణపూర్.
 • మర్రిగూడ,
 • చండూరు,
 • నాంపల్లి,
 • చౌటుప్పల్,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2004 పల్లా వెంకటరెడ్డి సి.పి.ఐ. చిలువెరు కాశీనాథ్‌ తెలుగుదేశం పార్టీ
2009 యాదగిరిరావు సి.పి.ఐ. పి.గోవర్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 ప్రభాకర్ రెడ్డి తెరాస పాల్వాయి స్రవంతి ఇండిపెండెంట్

2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సి.పి.ఐ పార్టీకి చెందిన పల్లా వెంకటరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిలువెరు కాశీనాథ్‌పై 11285 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వెంకటరెడ్డి 55252 ఓట్లు పొందగా, కాశీనాథ్ 43967 ఓట్లు సాధించారు.

2009 ఎన్నికలు:
 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థి యాదగిరిరావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.గోవర్థన్ రెడ్డిపై 3595 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారిగా శాసనసభలో ప్రవేశించారు.

2014 ఎన్నికలు:2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, ఇండిపెండెంటుగా పోటీచేసిన పాల్వాయి స్రవంతిపై 37884 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.


విభాగాలు: నల్గొండ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, భువనగిరి లోకసభ నియోజకవర్గం, మునుగోడు నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక