2, ఏప్రిల్ 2014, బుధవారం

సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం (Suryapet Assembly Constituency)

సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 4 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 యు.మల్సూర్ సి.పి.ఎం. ఇ.గోపయ్య కాంగ్రెస్ పార్టీ
1967 యు.మల్సూర్ సి.పి.ఎం. ఎం.మైసయ్య కాంగ్రెస్ పార్టీ
1972 ఇ.గోపయ్య కాంగ్రెస్ పార్టీ కె.ఈలయ్య సి.పి.ఎం.
1978 ఎ.పరంధాములు కాంగ్రెస్ పార్టీ ఎం.మైసయ్య జనతా పార్టీ
1983 ఇ.దేవయ్య తెలుగుదేశం పార్టీ బి.ఎం.రాజు కాంగ్రెస్ పార్టీ
1985 డి.సుందరయ్య తెలుగుదేశం పార్టీ ఎ.పరంధాములు కాంగ్రెస్ పార్టీ
1989 ఆకారపు సుదర్శన్ తెలుగుదేశం పార్టీ ఇ.దేవయ్య కాంగ్రెస్ పార్టీ
1994 ఆకారపు సుదర్శన్ తెలుగుదేశం పార్టీ జె.ఈలయ్య కాంగ్రెస్ పార్టీ
1999 డి.గోపాల్ కాంగ్రెస్ పార్టీ ఎ.సుదర్శన్ తెలుగుదేశం పార్టీ
2004 వి.వెంకయ్య కాంగ్రెస్ పార్టీ రజని కుమారి తెలుగుదేశం పార్టీ
2009 రాంరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పి.చంద్రశేఖర్ రెడ్డి తెరాస
2014 జి.జగదీశ్ రెడ్డి తెరాస ఎస్.వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్

2004 ఎన్నికలు:2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన వేదాస్ వెంకయ్య తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రజనీ కుమారిపై 11518 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినారు. వెంకయ్య 66679 ఓట్లు పొందగా, రజనీ కుమారికి 55161 ఓట్లు లభించాయి. ఎన్నికల బరిలో మొత్తం 8 మంది అభ్యర్థులు పోటీపడగా ప్రధాన పోటీ కాంగ్రెస్, తెలుగుదేశం అభ్యర్థుల మధ్యనే కొనసాగింది. వీరిద్దరికి కలిపి 95% ఓట్లు లభించాయి. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థితో సహా మిగిలిన మరో 5 ఇండిపెండెంట్ అభ్యర్థులు ధరావత్తు కోల్పోయారు.
2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్.దామోదర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి పి.చంద్రశేఖర్ రెడ్డిపై 6197 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన జి.జగదీశ్ రెడ్డీ తన సమీప ప్రత్యర్థి, ఇండిపెండెంటుగా పోటీచేసిన ఎస్.వెంకటేశ్వరరావుపై 4379 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.


విభాగాలు: నల్గొండ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, నల్గొండ లోకసభ నియోజకవర్గం, సూర్యాపేట  నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక