2, ఏప్రిల్ 2014, బుధవారం

దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం (Devarakonda Assembly Constituency)

దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2009 ఎన్నికల ముందు చేయబడిన పునర్విభజనలో ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది. ఈ నియోజకవర్గ పరిధిలో 5 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
 • దేవరకొండ
 • చింతపల్లి
 • గుండ్లపల్లి
 • చందంపేట
 • పెద్దఆదిశర్లపల్లి
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 కె.అనంతరామయ్య పీడీఎఫ్ ఎం.కొండల్ రావు కాంగ్రెస్ పార్టీ
1957 జి.నారాయణరెడ్డి
ముదిగొండ లక్ష్మయ్య
కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ
పి.పర్వతరెడ్డి
వి.చంద్రయ్య
పీడీఎఫ్
పీడీఎఫ్
1962 ఎలిమినేటి పెద్దయ్య సి.పి.ఐ. ఎం.లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ
1967 జి.నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ పి.పర్వతరెడ్డి సి.పి.ఐ.
1972 బి.రామశర్మ సి.పి.ఐ. డి.చౌహాన్ కాంగ్రెస్ పార్టీ
1978 డి.రవీంద్రనాయక్ కాంగ్రెస్ పార్టీ కె.హరియా సి.పి.ఐ.
1983 డి.రవీంద్రనాయక్ కాంగ్రెస్ పార్టీ కె.హరియా సి.పి.ఐ.
1985 ఎం.బి.చౌహాన్ సి.పి.ఐ. విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ
1989 ఎం.బి.చౌహాన్ సి.పి.ఐ. డి.రాగ్యానాయక్ కాంగ్రెస్ పార్టీ
1994 ఎం.బి.చౌహాన్ సి.పి.ఐ. డి.రాగ్యానాయక్ కాంగ్రెస్ పార్టీ
1999 డి.రాగ్యానాయక్ కాంగ్రెస్ పార్టీ వెశ్యానాయక్ తెలుగుదేశం పార్టీ
2002* ధీరావత్ భారతి కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నిక
2004 రవీంద్రకుమార్ రమావత్ సి.పి.ఐ. వాధ్యా శక్రునాయక్‌ తెలుగుదేశం పార్టీ
2009 బాలూనాయక్ కాంగ్రెస్ పార్టీ రవీంద్రనాయక్‌ సి.పి.ఐ.
2014 రవీంద్రనాయక్‌ సి.పి.ఐ. బిల్యానాయక్ తెలుగుదేశం పార్టీ
2018 రమావత్ రవీంద్రకుమార్ తెరాస బాలూనాయక్ నేనావత్ కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సి.పి.ఐ.కి చెందిన రవీంద్రకుమార్ రమావత్ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాధ్యా శక్రునాయక్‌పై 17187 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. రవీంద్రకుమార్ 61748 ఓట్లు సాధించగా, శక్రునాయక్ 44561 ఓట్లు పొందినారు. మొత్తం ఆరుగురు అభ్యర్థులు పోటీ చేయగా సి.పి.ఐ., తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోలైన ఓట్లలో 93.5% చేజిక్కించుకున్నారు. రంగంలో ఉన్న తెరాస, బి.ఎస్.పి. అభ్యర్థులతో సహా మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. సి.పి.ఐ పార్టీతో పొత్తు ఉండటంతో పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని సి.పి.ఐ.కు వదిలి మద్దతు ప్రకటించింది.

2009 ఎన్నికలు:

2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలూనాయక్ తన సమీప ప్రత్యర్థి, సీపీఐకు చెందిన రవీంద్రనాయక్‌పై 7368 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి సీపీఐ అభ్యర్థి రవీంద్రనాయక్ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బిల్యానాయక్‌పై 4216 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున రమావత్ రవీంద్రకుమార్, భాజపా తరఫున కళ్యాణ్ నాయక్ (గోపి), ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన బాబూనాయక్ పోటీచేశారు. తెరాసకు చెందిన రమావత్ రవీంద్రకుమార్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన బాలూనాయక్ నేనావత్ పై 38848 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: నల్గొండ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, నల్గొండ లోకసభ నియోజకవర్గం, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక