2, ఏప్రిల్ 2014, బుధవారం

వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం (Vikarabad Assembly Constituency)

వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాకు చెందిన 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ సెగ్మెంట్ చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. జనరల్‌గా ఉన్న 2014 ఎన్నికలలో ఇక్కడినుంచి తెరాస పార్టీకి చెందిన సంజీవరావు విజయం సాధించారు.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన ఈ నియోజకవర్గం ప్రకారం పరిధిలో 5 మండలాలు కలవు.
 • వికారాబాద్,
 • మర్పల్లి,
 • మోమిన్‌పేట్‌,
 • ధారూర్,
 • బంట్వారం,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2004 చంద్రశేఖర్‌ తెరాస మధురవేణి తెలుగుదేశం పార్టీ
2008* గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సంజీవరావు తెలుగుదేశం పార్టీ
2009 గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్ర సమితి
2014 సంజీవరావు తెరాస గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ
2018 మెతుకు ఆనంద్ తెరాస గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ


2004 ఎన్నికలు:
వరుసగా 4 సార్లు విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏ.చంద్రశేఖర్ తెరాసలోకి వెళ్ళడంతో సంజీవరావు భార్య మధురవేణికి తెలుగుదేశం అభ్యర్థిగా నిలబెట్టారు. కాంగ్రెస్, తెరాసల ఉమ్మడి అభ్యర్థిగా నిలబడిన ఏ.చంద్రశేఖర్ రెండు వేల ఒక్క ఓట్లతేడాతో విజయం సాధించారు. చంద్రశేఖర్‌కు 56647 ఓట్లు రాగా, మధురవేణికి 54646 ఓట్లు లభించాయి.

2008 ఉపఎన్నికలు:
2004లో విజయం సాధించిన తెరాస శాసనసభ్యుడు ఏ.చంద్రశేఖర్ రాజీనామాతో ఈ నియోజకవర్గంలో 2008లో ఉపఎన్నిక జరిగింది. తెరాస తరఫున ఏ.చంద్రశేఖర్ వరుసగా 6వ సారి ఎన్నికల బరిలో నిలబడ్డారు. కాంగ్రెస్ తరఫున గడ్డం ప్రసాద్ కుమార్, తెలుగుదేశం తరఫున సంజీవరావులు పోటీ చేశారు. ఐదుసార్లు (4 సార్లు తెలుగుదేశం తరఫున, ఒకసారి తెరాస తరఫున)ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన తెరాస అభ్యర్థి ఏ.చంద్రశేఖర్‌కు ఈ ఉప ఎన్నికలలో మూడవస్థానంలో రావడం గమనార్హం. కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాద్ తరఫున రాష్ట్ర గనుల, భూగర్భశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి కృషిచేయగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరఫున మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కృషిచేశారు. 2004 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలంగాణా రాష్ట్ర సమితి గెలిచినప్పటికీ 2008 ఉప ఎన్నికలలో ప్రధానంగా కాంగ్రెస్, తెలుగుదేశం మధ్యనే పోటీ ఉత్కంఠతో సాగింది. చివరికి కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాద్ కుమార్ సమీప తెలుగుదేశం అభ్యర్థి సంజీవరావుపై 28,892 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినారు.
2008 ఉపఎన్నికలలో వివిధ అభ్యర్థులు పొందిన ఓట్ల వివరాలు
అభ్యర్థిపార్టీపొందిన ఓట్లు
ప్రసాద్ కుమార్కాంగ్రెస్ పార్టీ67,814
సంజీవరావుతెలుగుదేశం పార్టీ38,922
ఏ.చంద్రశేఖర్తెలంగాణా రాష్ట్ర సమితి15,415

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన గడ్డం ప్రసాద్ కుమార్ తన సమీప ప్రత్యర్థి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన చంద్రశేఖర్‌పై 4859 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 13వ శాసనసభలో ప్రసాద్ కుమార్‌కు మంత్రిపదవి లభించింది.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస తరఫున పోటీచేసిన సంజీవరావు తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం ప్రసాద్ పై కుమార్‌పై 10072 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున మెతుకు ఆనంద్ భాజపా తరఫున ............., ప్రజాఫ్రంట్ తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ పోటీచేశారు. తెరాసకు చెందిన మెతుకు ఆనంద్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ పై 2993 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు..

విభాగాలు: రంగారెడ్డి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం, వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక