13, మే 2014, మంగళవారం

పురపాలక సంఘాల ఎన్నికలు 2014 (Muncipal Elections 2014)

పురపాలక సంఘాల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్మొత్తం 53 (తెలుగుదేశం పార్టీకి అత్యధికం)
తెలంగాణమొత్తం 53 (కాంగ్రెస్ పార్టీకి అత్యధికం)
నగరపాలక సంస్థలు
ఆంధ్రప్రదేశ్మొత్తం 7 (తెదేపా 5, వైకాపా 2)
తెలంగాణమొత్తం 3 (మూడు చోట్లా హంగ్)
2014 పురపాలక సంఘాల ఎన్నికలు మార్చి 30న జరిగాయి. 2005లో జరిగిన ఎన్నికల గడుపు 2010లోనే ముగిసిననూ ప్రత్యేక అధికారుల పాలనలో ఉంచుతూ చివరికి కోర్టు ఉత్తర్వుల ప్రకారం మార్చి 30, 2014న న్నికలు నిర్వహించారు. ఎన్నికలు జరిగిన 44 రోజుల తర్వాత కౌంటింగ్ జరిగింది. అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు ఉండటంతో ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆ ఎన్నిలకపై పడుతుందని కొందరు కోర్టుకు వెళ్ళడంతో వెంటనే కౌంటింగ్ జరుపుటకు సాధ్యపడలేదు.

తెలంగాణలో 53 పురపాలక సంఘాలు, 3 నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో 92 పురపాలక సంస్థలు, 7 నగర పాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు.

తెలంగాణలోని 53 పురపాలక సంఘాలలో అత్యధిక వార్డు స్థానాలను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. 527 వార్డులు లభించగా రెండోస్థాబనంలో తెరాసకు 313 వార్డులు, తెలుగుదేశం పార్టీకి 161 వార్డూలు లభించాయి. కాంగ్రెస్ పార్టీకి 16 పురపాలక సంఘాలలో, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి 4, తెలుగుదేశం పార్టీకి 3, భారతీయ జనతాపార్టీకి 1, ఎంఐఎంకు 1 పురపాలక సంఘాలలో స్పష్టమైన మెజారిటీ లభించింది. మరో 28 పురపాలక సంఘాలలో హంగ్ ఏర్పడింది. 3 నగరపాలక సంస్థలలో ఎవరికీ స్పష్టమైన మెజారిటి లభించలేదు. కరీంనగర్‌లో తెరాస 24 స్థానాలు పొంది మరో 2 స్థానాలకు దూరంలో ఉంది. రామగుండంలో కాంగ్రెస్ పార్టీకి మరో 7 స్థానాలు కావలసి ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాల వార్డులలో తెలుగుదేశం అత్యధిక స్థానాలు పొందినది. తెలుగుదేశం పార్టీకి 1400పైగా వార్డూలు లభించగా, రెండోస్థానంలో వైకాపా 900పైగా వార్డులలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 53 వార్డులు మాత్రమే లభించాయి. తెలుగుదేశం పార్టీ 62 పురపాలక సంఘాలలో, వైకాపా 17 పురపాలక సంఘాలలో స్పష్టమైన మెజారిటి సాధించగా మరో 13 పురపాలక సంఘాలలో హంగ్ ఏర్పడింది. 7 నగర పాలక సంస్థలలో తెలుగుదేశం పార్టికి 5 (రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, చిత్తూరు, అనంతపురం), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2 (నెల్లూరు, కడప) లభించాయి.



విభాగాలు: ఎన్నికలు, 2014, పురపాలక సంఘాలు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక