6, మే 2014, మంగళవారం

దర్శి అసెంబ్లీ నియోజకవర్గం (Darshi Assembly Constituency)

దర్శి అసెంబ్లీ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది ఒంగోలు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 222. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గ సంఖ్య 103 గా మారింది.

నియోజకవర్గంలోని మండలాలు:

  • దోనకొండ మండలం,
  • కురిచేడు మండలం,
  • ముండ్లమూరు మండలం,
  • దర్శి మండలం,
  • తాళ్ళూరు మండలం,



గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 బి.శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎం.వెంకటరమణ తెలుగుదేశం పార్టీ
2014 శిద్ధా రాఘవరావు తెలుగుదేశం పార్టీ బి.శివప్రసాద్ రెడ్డి వైకాపా
2019 మద్దిశెట్టి వేణుగోపాల్ వైకాపా కదిరి బాబూరావు తెలుగుదేశం పార్టీ

2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం.వెంకటరమణపై 13390 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. శివప్రసాద్ రెడ్డి తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి 2004లో ఇక్కడి నుంచి గెలుపొందారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన శిద్ధా రాఘవరావు తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే, వైకాపాకు చెందిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై 1687 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. శివప్రసాద్ రెడ్డి 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించగా ఈ సారి వైకాపా టికెట్‌పై పోటీచేశారు.

2019 ఎన్నికలు:
2019 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన మద్దిశెట్టి వేణుగోపాల్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కదిరి బాబూరావు పై 39057 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: ప్రకాశం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒంగోలు లోకసభ నియోజకవర్గం, దర్శి అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక