24, మే 2014, శనివారం

డి.వి.సదానంద గౌడ (D.V.Sadananda Gowda)

డి.వి.సదానంద గౌడ
జననంమార్చి 18, 1953
పదవులుకర్ణాటక ముఖ్యమంత్రి (2011-12), కేంద్రమంత్రి (2014-),
పార్టీభాజపా
డీవీఎస్‌గా ప్రసిద్ధి చెందిన డి.వి.సదానంద గౌడ మార్చి 18, 1953న కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మండెకోలులో జన్మించారు. న్యాయశాస్త్ర విద్యను అభ్యసించి ప్రారంభంలో కొంతకాలం న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1983 నుంచి 1988 వరకు భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1989లో అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసి పరాజయం పొందినారు. 1994లో తొలిసారి పుత్తూరు నుంచి విజయం సాధించి కర్ణాటక శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో రెండో సారి కూడా అదే స్థానం నుంచి శాసనసభకు ఎన్నికై శాసనసభలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా వ్యవహరించారు. 2003లో పబ్లిక్ అక్క్కౌంట్స్ కమిటీ చైర్మెన్‌గా పనిచేశారు. 2004లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నుకయ్యారు. 2009లో ఉడిపి-చిక్కమగళూరు నియోజకవర్గం నుంచి రెండవసారి లోకసభకు ఎన్నికైనారు. బి.ఎస్.యడ్యూరప్పను లోకాయుక్త తప్పుపట్టడంతో పార్టీలో వివాదరహితుడైన సదానందగౌడకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది. ఆగష్టు 4, 2011న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2014లో 16వ లోకసభకు ఎన్నికై 26 మే, 2014 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైనారు.


విభాగాలు: కర్ణాటక రాజకీయ నాయకులు, కర్ణాటక ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, 16వ లోకసభ సభ్యులు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక