24, మే 2014, శనివారం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
స్థాపనమార్చి 11, 2011
స్థాపకుడువై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
రాష్ట్రాలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ,
ఎన్నికల గుర్తుసీలింగ్ ఫ్యాన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్చి 11, 2011 నాడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిచే ప్రారంభించబడింది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పూర్తి పేరు కల ఈ పార్టి సంక్షిప్తంగా వైకాపా లేదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా పిలువబడుతుంది. ఈ పార్టీ ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్.

వాస్తవానికి ఈ పార్టీని 2009లోనే శివకుమార్‌చే రిజిష్టర్ చేయించబడింది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన పిదప తన తండ్రి వైఎస్సార్ పేరుతో పార్టీని ప్రారంభించదల్చి ఆ పేరుతో అదివరకే పార్టీ రిజిష్టర్ చేయించి ఉండటంతో శివకుమార్‌ను తన పార్టీలో చేర్చుకొని తర్వాత అధ్యక్షపదవి జగన్ పేరిట మార్చుకోవడమైనది.

జగన్ కడప లోకసభ స్థానానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికలలో వైకాపా తరఫున పోటీచేసి 5 లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ విప్‌ను ఉల్లంఘించి అవిశ్వాస తీర్మానంలో ఓటుచేయడంతో సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు జగన్ మద్దతుదారులు ఉప ఎన్నికలలో వైకాపా తరఫున పోటీచేసి విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో వైకాపా 67 శాసనసభ స్థానాలు, 9 లోకసభ స్థానాలలో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం మినహా రాయలసీమ జిల్లాలలో, దక్షిణ కోస్తా జిల్లాలలో అధికంగా స్థానాలు పొందగా, తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఒక లోకసభ, 3 అసెంబ్లీ స్థానాలను పొందినది. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖపట్టణం నుంచి లోకసభకు పోటీచేసిన వైకాపా గౌరవాధ్యరాలు వై.ఎస్.విజయమ్మ భాజపా అభ్యర్థి చేతిలో పరాజయం పొందగా, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి శాసనసభకు ఎన్నికైనారు.కడప జిల్లాలో ఒక్క రాజంపేట స్థానం మినహా అన్ని స్థానాలలో వైకాపా విజయం సాధించింది.

విభాగాలు: భారతదేశ రాజకీయ పార్టీలు, 2011 స్థాపితాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక