26, మే 2014, సోమవారం

గోవా (Goa)

గోవా
రాజధానిపనాజీ
పెద్ద నగరంవాస్కోడగామా
జనాభా14,57,723
జిల్లాలు2
గోవా భారతదేశంలో పశ్చిమతీరాన అరేబియా సముద్రతీరాన ఉన్న చిన్న రాష్ట్రము. గోవాకు ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పు మరియు దక్షిణాన కర్ణాటక ఉన్నాయి. ఇది దేశంలో వైశాల్యపరంగా రెండవ అతిచిన్న రాష్ట్రం. జనాభా పరంగా నాలుగవ అతిచిన్న రాష్ట్రం. గోవా రాజధాని పనాజీ. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరచుకొని ఆ తర్వాత అధికారాన్ని హస్తగతం చేసుకొన్నారు. 1961లో భారత ప్రభుత్వం గోవాను తన అధీనంలోకి తీసుకొనేవరకు ఇది పోర్చుగీసు పాలనలో ఉండేది. సుందరమైన బీచ్ లు, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపద తదితరాల వల్ల గోవా మంచి పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధిచెందింది.

భౌగోళికం, వాతావరణం:
గోవాకు పశ్చిమాన అరేబియా సముద్రం, ఉత్తరాన మహారాష్ట్ర, దక్షిణమున మరియు తూర్పున కర్ణాటక సరిహద్దులుగా ఉన్నాయి. పడమటి కనుమలులోని కొంకణ తీరాన ఉన్న గోవాకు 101 కి.మీ. సముద్ర తీరము ఉన్నది. మాండవి, జువారి, తెరెఖోల్, ఛపోరా, బేతుల్ అనేవి గోవాలోని నదులు. జువారి నది ముఖద్వారాన ఉన్న మార్మగోవా సహజ నౌకాశ్రయం.  గోవా బీచ్‌లు పర్యాటక కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి.

జనాభా:
2001 ప్రకారం గోవా జనాభా 13,43,998 కాగా 2011 నాటికి 8.2% పెరిగి 14,57,723కు  చేరింది. జనాభాలో 65% హిందువులు, 26% క్రైస్తవులు, 7% ముస్లిములు ఉన్నారు. కొంకణి, మరాఠి, కన్నడ ఇక్కడి ప్రధాన భాషలు. 

చరిత్ర:
గోవా ప్రాంతాన్ని చరిత్రలో మౌర్యులు, శాతవాహనులు, బాదామి చాళుక్యులు, సిల్హార వంశస్తులు, దక్కన్ నవాబులు పాలించారు. 1312 లో ఈ ప్రాంతం ఢిల్లీ సుల్తానుల వశమైనది. 1370లో విజయనగర రాజు మొదటి హరిహర రాయలు గోవాను జయించాడు. 1469లో బహమనీ సుల్తానులు దీనిని కైవసం చేసుకొన్నారు. అనంతరం బీజాపూర్ నవాబు ఆదిల్‌షా తన రెండవ రాజధానిగా చేసుకొన్నాడు.

గోవాలోని ఒక బీచ్
1498లో క్రొత్త సముద్రమార్గాన్ని కనుక్కొన్న మొదటి ఐరోపా వర్తకుడు వాస్కోడగామా కేరళ లో కోజికోడ్‌లో అడుగుపెట్టాడు. తరువాత అతను గోవా చేరాడు. సుగంధ ద్రవ్యాల వ్యాపారమే పోర్చుగీసు వారి అప్పటి లక్ష్యము. కాని 1501 లో తిమ్మయ్య అనే స్థానిక రాజు తరపున పోరాడి అల్ఫోంసో డి అల్బుకర్క్ అనే పోర్చుగీసు అడ్మిరల్ బహమనీ రాజులను ఓడించాడు. 1560-1812 మధ్య స్థానికులు బలవంతంగా క్రైస్తవ మతానికి మార్చబడ్డారు. బ్రిటిష్‌వారు వచ్చిన తరువాత పోర్చుగీసు అధికారం గోవాకు, మరి కొద్ది స్థలాలకు పరిమితమైనది. పోర్చుగీసు వారికి గోవా విలువైన విదేశీ స్థావరమైనది. 1843లో రాజధాని పాత గోవా నుండి పనజీకి మార్చారు.

1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా గోవాను వదులుకోవడానికి పోర్చుగీసువారు ఒప్పుకోలేరు. 1961 డిసెంబరు 12న భారత సైన్యం గోవాలో ప్రవేశించి గోవాను ఆక్రమించింది. కొద్దిపాటి ఘర్షణ తరువాత డామన్, డయ్యులు కూడా భారతదేశం అధీనంలోకి వచ్చాయి. కాని 1974 వరకు పోర్చుగీసు ప్రభుత్వం గోవాను భారతదేశంలో అంతర్భాగంగా అంగీకరించలేదు. 1987 మే 30న గోవా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.

రాజకీయాలు:
పార్లమెంటులో గోవా తరఫున ఇద్దరు లోకసభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తారు. రాష్ట్ర శాసనసభలో 40 స్థానాలున్నాయి. భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఈ రాష్ట్రంలో బలంగా ఉన్నాయి. 2012 శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ, మహరాష్ట్ర వాది గోమంతక్ పార్టీలు కలిసి పూర్తి మెజారిటి సాధించాయి. 2014 లోకసభ ఎన్నికలలో భాజపా విజయం సాధించింది. భాజపాకు చెందిన ప్రమోద్ సావంత్ గోవా ముఖ్యమంత్రిగా ఉన్నారు.
 
ఇవి కూడా చూడండి:
 


హోం,
విభాగాలు:
భారతదేశ రాష్ట్రాలు, గోవా, 1961,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక