6, మే 2014, మంగళవారం

కోడూరు అసెంబ్లీ నియోజకవర్గం (Koduru Assembly Constituency)

కోడూరు అసెంబ్లీ నియోజకవర్గం కడప జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది రాజంపేట లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 246. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గ సంఖ్య 127 గా మారింది. ఇది ఎస్సీలకు కేటాయించబడింది.


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 కె.శ్రీనివాసులు కాంగ్రెస్ పార్టీ అజయ్ బాబు తెలుగుదేశం ఫార్టీ
2012* కె.శ్రీనివాసులు వైకాపా కనుపర్తి ఈశ్వరయ్య కాంగ్రెస్ పార్టీ
2014 కె.శ్రీనివాసులు వైకాపా సుబ్బరామయ్య తెలుగుదేశం ఫార్టీ
2019 కె.శ్రీనివాసులు వైకాపా పంతగిరి నరసింహప్రసాద్ తెలుగుదేశం ఫార్టీ

2012 ఉప ఎన్నికలు:
2012 జూన్ లో జరిగిన ఉప ఎన్నికలో వైకాపా తరఫున పోటీచేసిన కొరముట్ల శ్రీనివాసులు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుపర్తి ఈశ్వరయ్యపై 31991 మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 159900 ఓట్లలో 123520 పోల్ కాగా అందులో వైకాపాకు 66456 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 34465 ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 17594 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన కొరముట్ల శ్రీనివాసులు తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన సుబ్బరామయ్యపై 1915 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2019 ఎన్నికలు:
2019 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన కొరముట్ల శ్రీనివాసులు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంతగిరి నరసింహప్రసాద్ పై 34879 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: కడప జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, రాజంపేట లోకసభ నియోజకవర్గం, కోడూరు అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక