6, మే 2014, మంగళవారం

ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం (Udayagiri Assembly Constituency)

ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది నెల్లూరు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 242. నియోజకవర్గం పరిధిలో 8 మండలాలు కలవు.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • సీతారామపురం,
  • ఉదయగిరి,
  • వరికుంటపాడు,
  • వింజమూరు,
  • దుత్తలూరు,
  • కలిగిరి,
  • కొండాపురం,
  • జలదంకి,


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1951 కోవి రామయ్య చౌదరి


1955 షేక్ మౌలా సాహెబ్ కాంగ్రెస్ పార్టీ కె.గురుస్వామి రెడ్డి సీపీఐ
1962 పి.వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎస్.పాపిరెడ్డి సీపీఐ
1967 ఎన్.ధనెన్కుల స్వతంత్ర్య పార్టీ ఆర్.సి.కోవి కాంగ్రెస్ పార్టీ
1972 పి.చెంచురామయ్య కాంగ్రెస్ పార్టీ ఎ.తిమ్మయ్య స్వతంత్ర్య పార్టీ
1978 ఎం.వెంకయ్య్యనాయుడు జనతాపార్టీ మాదాల జానకీరామ్ కాంగ్రెస్ ఐ
1983 ఎం.వెంకయ్య్యనాయుడు భాజపా మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1985 మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.విజయరామిరెడ్డి ఇండిపెండెంట్
1989 మాదాల జానకీరామ్ కాంగ్రెస్ పార్టీ కె.విజయరామిరెడ్డి తెలుగుదేశం పార్టీ
1994 కె.విజయరామిరెడ్డి తెలుగుదేశం పార్టీ మాదాల జానకీరామ్ కాంగ్రెస్ పార్టీ
1999 కె.విజయరామిరెడ్డి తెలుగుదేశం పార్టీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2004 మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.విజయరామిరెడ్డి తెలుగుదేశం పార్టీ
2009 మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.విజయరామిరెడ్డి తెలుగుదేశం పార్టీ
2012* మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ బొల్లినేని రామారావు తెలుగుదేశం పార్టీ
2014 బొల్లినేని రామారావు తెలుగుదేశం పార్టీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్
2019




2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టికి చెందిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన కె.విజయరామిరెడ్డిపై 13482 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. విప్ ఉల్లంఘనతో చంద్రశేఖర్ రెడ్డి పదవి కోల్పోవడంతో 2012లో ఉప ఎన్నికలు నిర్వహించబడ్డాయి.

2012 ఉప ఎన్నికలు:
2012 జూన్ లో జరిగిన ఉప ఎన్నికలో వైకాపా తరఫున పోటీచేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొల్లినేని వెంకటరామారావుపై 30598 మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 195962 ఓట్లలో 160410 పోల్ కాగా అందులో వైకాపాకు 75103 ఓట్లు, తెలుగుదేశం పార్టీకి 44505 ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 34489 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన్ బొల్లినేని రామారావు తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై 4673 ఓట్ల మెజారిటితో గెలుపొందినారు.

విభాగాలు: నెల్లూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, నెల్లూరు లోకసభ నియోజకవర్గం, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక