25, మే 2014, ఆదివారం

ఎం.వెంకయ్య నాయుడు (M.Venkaiah Naidu)

ఎం.వెంకయ్య నాయుడు
జననంజూలై 1, 1949
స్వస్థలంచవటపాలెం (నెల్లూరు జిల్లా)
పదవులుభారత ఉపరాష్ట్రపతి, భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి,
భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ నేతలలో ఒకడైన ముప్పవరపు వెంకయ్య నాయుడు 1949, జూలై 1న నెల్లూరు జిల్లాలోని చవటపాలెంలో జన్మించారు. నెల్లూరులోని వి.ఆర్.కళాశాల నుంచి డిగ్రీ పూర్తిచేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందినారు. 2002లో జానా కృష్ణమూర్తి తరువాత భాజపా అధ్యక్ష పదవిని చేపట్టి 2004, అక్టోబర్ 18 వరకు ఆ పదవిలో పార్టీకి సేవలందించారు. రెండు సార్లు ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైనారు. ఆ తరువాత రాజ్యసభకు ఎన్నికై ఆ పదవిలో కొనసాగుతున్నారు. శాసనసభలో, రాజ్యసభలో, భాజపా అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలను ఆయన మిత్రబృందం "అలుపెరుగని గళం విరామమెరుగని గళం." పేరుతో సంకలనం చేసి విడుదల చేసింది. 26 మే, 2014 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైనారు. ఆగస్టు 11, 2017న భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు.

బాల్యం విద్యాభ్యాసం:
1942, జూలై 1 న నెల్లూరు జిల్లాలోని చవటపాలెం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వెంకయ్యనాయుడు నెల్లూరులోని వి.ఆర్.కళాశాల నుంచి డిగ్రీ పూర్తిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందినారు. విద్యార్థి జీవితం నుంచే వెంకయ్యనాయుడు సాధారణ ప్రజానీకపు సంక్షేమానికి పాటుపడ్డారు. రాజకీయ మరియు సామాజిక కార్యకలాపాలలో కూడా అతనిలో అప్పుడే బీజాలు పడ్డాయి. స్వలాభం కొరకు కాకుండా దేశం కోసం ప్రాణాలర్పించిన దేశభక్తుల మరియు అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా గళమెత్తిన నాయకుల జీవితాలను ఆదర్శంగా తీసుకున్నారు. అత్యవసర పరిస్థితి కాలంలో అనేక మాసాలు జైలు జీవితం గడిపినారు.

రాజకీయ జీవితం:
1973-74లో ఆంధ్ర విశ్వవిద్యాలయపు విద్యార్థినాయకుడిగా ఉన్నప్పుడే అతనిలో రాజకీయ లక్షణాలు ఏర్పడ్డాయి. 1977 నుంచి 1980 వరకు జనతా పార్టీ యువ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. అదే సమయంలో 1978లో తొలిసారిగా ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికైనారు. 1980 నుంచి శాసనసభలో భాజపా శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. 1983లో మళ్ళీ అదే స్థానం నుంచి రెండో పర్యాయం శాసనసభ్యుడుగా ఎన్నికైనారు. 1985లో భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించబడి 1988 వరకు కొనసాగి ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా నియమించబడ్డారు. 1993నుండి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 1998లో రాజ్యసభకు ఎన్నికైనారు. 2000లో అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా వ్యవహరించారు. 2002 జూలై 1 నుంచి 2004, అక్టోబర్ 5 వరకు భాజపా అధ్యక్షపదవిలో సేవలందించి మహారాష్ట్ర ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనారు. 26 మే, 2014 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైనారు. ఆగస్టు 11, 2017న భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు.



విభాగాలు: భాజపా జాతీయ అధ్యక్షులు, భారత ఉపరాష్ట్రపతులు, భారతీయ జనతాపార్టీ నాయకులు, నెల్లూరు జిల్లా ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక