దక్షిణాఫ్రికా ఆఫ్రికా ఖండంలో దక్షిణాన ఉన్న దేశము. ఈ దేశం అట్లాంటిక్ మరియు హిందూ మహాసముద్రాలకు సరిహద్దుగా 2,798 కిలోమీటర్ల తీరరేఖను కలిగియుంది. ప్రపంచంలో ఈ దేశం జనాభాలో 24 స్థానంలోనూ, వైశాల్యంలో 25వ స్థానంలోనూ ఉంది. ఈ దేశంలో పలు జాతులవారు ఉండుటచే ఈ దేశానికి 11 అధికార భాషలు ఉన్నాయి. దేశ జనాభాలో దాదాపు 80% ప్రజలు నల్లజాతి ఆఫ్రికన్లు. ఆఫ్రికాలో ఇది రెండవ మరియు, ప్రపంచంలో 28వ పెద్ద ఆర్థికవ్యవస్థ కల దేశంగా ఉంది. ఈ దేశానికి ప్రిటోరియా, కేప్‌టౌన్, బ్లూంఫోంటీన్‌లు కార్యనిర్వాహక, శాసన, న్యాయస్థానపు రాజధానులుగా ఉన్నాయి. 2011 నాటికి దక్షిణాఫ్రికా జనాభా 5,17,70,560.
భౌగోళికం, సరిహద్దులు: దక్షిణాఫ్రికా ఆఫ్రికా ఖండంలో దక్షిణంవైపున 22°-35° ఉత్తర అక్షాంశం, 16° - 33° తూర్పు రేఖాంశంపై ఉంది. ఈ దేశాణికి ఉత్తరాన నమీబియా, బీట^వానా, జింబాబ్వే దేశాలు, తూర్పున మొజాంబిక్, స్వాజీలాండ్ దేశాలు ఉండగా దక్షిణాన, ఈగ్నేయాన, నైరుతి దిశలలో దక్షిణ అట్లాంటిక్ మరియు హిందూ మహాసముద్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. లెసోథో దేశం భౌగోళికంగా మధ్యలో ఉండి నలువైపులా దక్షిణాఫ్రికాచే చుట్టబడిఉంది. ఈ దేశ వైశాల్యం 12,19,912 చదరపు కిలోమీటర్లు. జనాభా: 2011 నాటికి దక్షిణాఫ్రికా జనాభా 5,17,70,560. ఇందులో నల్లజాతి ఆఫ్రికన్లు 79%, ఆసియన్లు 2.4% ఉన్నారు. అత్యధిక జనాభా కల నగరాలలో సొవెటో, జొహన్నెస్‌బర్గ్, ప్రిటోరియా, డర్బాన్, తెంబిసా, కేప్‌టౌన్ తొలి 6 స్థానాలలో ఉన్నాయి.
సముద్రమార్గం కనిపెట్టిన పిదప 17వ శతాబ్ది చివరిలో డచ్ ఈస్టిండియా కంపెనీ కేప్‌టౌన్‌లో వ్యాపారస్థావరాన్ని నెలకొల్పింది. ఇండోనేషియా, మడగాస్కర్, భారతదేశం నుంచి కార్మికులను రప్పించి బానిసలుగా చేసుకున్నారు. 18వ శతాబ్ది చివరిలో గుడ్‌హోఫ్ అగ్రాన్ని ఇంగ్లాండ్ స్వాధీనం చేసుకుంది. 19వ శతాబ్ది చివరిలో దక్షిణాఫ్రికాలో బంగారం మరియు వజ్రాల నిక్షేపాలు బయటపడ్డాయి. దీనితో వలసలు కూడా అధికమయ్యాయి. అదేకాలంలో స్థానిక బీఓయర్లకు, పాళక్ బ్రిటీషర్లకు మధ్య యుద్ధాలు తలెత్తాయి. రెండో బాయర్ యుద్ధాల అనంతరం బ్రిటీష్ ప్రభుత్వం 1910లో దక్షిణాఫ్రికాకు నామమాత్ర స్వాతంత్ర్యాన్ని ప్రసాదించింది. 1948 తర్వాత జాతివిక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. మహాత్మాగాంధీ కూడా దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు బ్రిటీష్ వారిచే వివక్షకు గురైనాడు. 1961లో దక్షిణాఫ్రికా రిపబ్లిక్‌గా ప్రకటించబడింది. జాతివివక్షకు వ్యతిరేకంగా ఆఫ్రికన్స్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడింది. జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడి 17 సంవత్సరాలు జైలులో గడిపిన నెల్సన్ మండేలా 1994లో తొలి నల్లజాతి అధ్యక్షుడిగా ఎన్నికైనారు. క్రీడలు: సాకర్, రగ్బీ మరియు క్రికెట్ ఇక్కడి జనాదరణ కలిగిన క్రీడలు. 2010లో ఫిఫా ప్రపంచకప్‌ను, 2003 క్రికెట్ ప్రపంచకప్‌ను, 2007 టి-20 ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికా నిర్వహించింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
Tags: South Africa Essay in Telugu, South Africa country information in Telugu, Countries information in Telugu, Telugulo Deshalu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి