6, మే 2014, మంగళవారం

ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం (Ongole Assembly Constituency)

ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది ఒంగోలు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 227. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గ సంఖ్య 108 గా మారింది.

నియోజకవర్గంలోని మండలాలు:

  • ఒంగోలు మండలం,
  • కొత్తపట్నం మండలం,






గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 బాలినేని శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఈదర హరిబాబు తెలుగుదేశం పార్టీ
2012* బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైకాపా దామచర్ల జనార్థన్ రావు తెలుగుదేశం పార్టీ
2014 దామచర్ల జనార్థన్ రావు తెలుగుదేశం పార్టీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైకాపా
2019 బాలినేని శ్రీనివాస్ రెడ్డివైకాపా దామచర్ల జనార్థన్ రావుతెలుగుదేశం పార్టీ

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఈదర హరిబాబుపై 22986 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. బాలినేనికి ఇది 3వ విజయం. ప్రజారాజ్యం పార్టీ తరఫున పర్వత్ రెడ్డి ఆనంద్ పోటీచేశారు.

2012 ఉప ఎన్నికలు:
2012 జూన్ లో జరిగిన ఉప ఎన్నికలో వైకాపా తరఫున పోటీచేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్థనరావుపై 27403 మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 200546 ఓట్లలో 158238 పోల్ కాగా అందులో వైకాపాకు 77222 ఓట్లు, తెలుగుదేశం పార్టీకి 49819 ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 23020 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన దామచర్ల జనార్థన్ రావు తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే, వైకాపాకు చెందిన బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై 12428 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2019 ఎన్నికలు:
2019 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు) తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్థన్ రావు పై 22245 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: ప్రకాశం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒంగోలు లోకసభ నియోజకవర్గం, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక